ఈ క్రమంలోనే ఆ యువకుడు నిజంగానే యువతి ఫోన్ చేసింది అనుకొని మురిసిపోయాడు. ఈ క్రమంలోనే ఇక చెప్పిన ప్లేస్ కి ఎంతో ఆనందంగా వెళ్ళి పోయాడు. కానీ ఇక రూమ్ లోకి వెళ్లగానే ఊహించని షాక్ తగిలింది. అక్కడ ఆ యువతి కి బదులు ఆమె సోదరుడు ఉన్నాడు. దీంతో ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో వెలుగులోకి వచ్చింది. మదనపల్లె టౌన్ లో ఉండే మైనర్ బాలుడు రామారావు కాలనీ లో ఉండే యువతికి తరచు ఫోన్ చేస్తూ వేధింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు.
యువకుడి తీరుతో భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని ఆమె సోదరులకు చెప్పింది. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే యువతితో ఆ యువకుడికి ఫోన్ చేయించారు. లాడ్జి కి రావాలి అంటూ పిలిపించారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇక ఆ యువతి సోదరుడితో పాటు అతని స్నేహితులు అందరూ కూడా మూకుమ్మడిగా మైనర్ బాలుడిపై దాడి చేశారు. దారుణంగా చితకబాదారు. అంతేకాకుండా ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేయడంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది. స్థానికంగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి