టాలీవుడ్ యాక్షన్ హీరోల్లో తనదైన ముద్ర వేసుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్, ప్రస్తుతం కెరీర్‌లో ఒక భారీ కమర్షియల్ సక్సెస్ కోసం కసిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ రేసులో తన తర్వాత వచ్చిన హీరోలు దూసుకుపోతున్నా, గోపీచంద్ మాత్రం తనదైన శైలిలో ‘మాస్’ హిట్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తాజాగా ఆయన లైనప్‌లో ఉన్న రెండు క్రేజీ ప్రాజెక్టులు చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద గోపీచంద్ గర్జన గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.


‘ఘాజీ’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాను అందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి, ఇప్పుడు గోపీచంద్‌తో తన 33వ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ సినిమా గత గోపీచంద్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్‌లో భాగంగా ఏకంగా 25 రోజుల పాటు క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు టాప్ ఫైట్ మాస్టర్లు వర్క్ చేస్తున్నారు. ఇందులో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో చూడని విధంగా సరికొత్తగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.



ఒకవైపు 33వ సినిమా షూటింగ్ జరుగుతుండగానే, గోపీచంద్ మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన క్రేజీ ఫైట్ మాస్టర్ వెంకట్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను ఆయన సిద్ధం చేశారు. ‘యాత్ర’ వంటి సంచలన సినిమాలను నిర్మించిన 70 MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కాబోతోంది. హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.గోపీచంద్ సైలెంట్‌గా తన యాక్షన్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి టేకింగ్, వెంకట్ మాస్టర్ యాక్షన్ విజన్ తోడైతే గోపీచంద్ మళ్ళీ ట్రాక్‌లోకి రావడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: