సైబర్ నేరగాళ్ల బెడద రోజు రోజుకు ఎక్కువవుతోంది. టెక్నాలజీ పట్ల సైబర్ నేరగాళ్లకు ఉన్న తెలివిని మంచి పనుల కోసం కాకుండా జనాల్ని బురిడీ కొట్టించడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  ఇక అటు పోలీసులు కూడా సైబర్ నేరాలపై ఎక్కువగా నిఘా ఉంచుతున్నారు.  ఎక్కడిక క్కడ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.  అయినప్పటికీ కేటుగాళ్ల బెడద మాత్రం ఎక్కడా తగ్గడం లేదు  ఏదో ఒక విధంగా జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు.  ప్రజల అవసరాలనే తమ అవకాశం గా మార్చు కుంటున్నారు.



 అమాయకుల ను టార్గెట్ గా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  ముఖ్యం గా ఇటీవలి కాలం లో నిరుద్యోగులనే టార్గెట్ గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.  జాబ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగు లకు పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ కల్పిస్తున్నారు. కొంత మంది కేటుగాళ్లు ఇలా నిరుద్యోగుల నుంచి పూర్తి వివరాలు సేకరించి ఖాతాలు ఖాళీ చేస్తూ ఉన్నారు.  మరి కొంత మంది మోసగాళ్లు ఇక ఉద్యోగం పేరు తో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి చివరికి ప్లేట్ ఫిరా యిస్తున్నారు  .



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఓ యువతిని ఉద్యోగం పేరుతో మాయ మాటల తో నమ్మించారు కేటుగాళ్ళు. ఇక ఆ యువతి దగ్గర నుంచి ఏకం గా లక్షన్నర వరకు కాజేశారు. ఫలక్నుమా కు చెందిన బీటెక్ విద్యార్థిని సోనాలి కి జాబ్ పేరుతో ఫోన్ చేసారు.  Tcs లో ఉద్యోగం కన్ఫామ్ అయ్యింది అంటూ నమ్మ బలికారు. ఇక ముందుగా లక్షన్నర సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే అపాయింట్మెంట్ లెటర్ వస్తుందని నమ్మించి.. చివరకి డబ్బు పంపించ గానే ప్లేట్  ఫిరాయించారు. దీంతో మోస పోయాను అని గ్రహించిన  బాధిత యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: