ఇక కట్టుకున్నవారు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మరికొంతమంది భార్య పై ఉన్న కోపాన్ని పిల్లలపై చూపిస్తూ ఏకంగా దారుణంగా పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నరరూప రాక్షసుడు గా మారిపోయాడు. భార్యపై అనుమానం కోపంతో ఇక భార్యను ఏమి చేయలేక.. అభం శుభం తెలియని చిన్నారులు పాలిట యమకింకరుడుగా మారిపోయాడు ఆ తండ్రి. గోరు ముద్దలు తినిపించాల్సిన తండ్రి ఇక పిల్లలు తాగే పాలల్లో విషం కలిపాడు. చివరికి అభం శుభం తెలియని ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
మనుబోలు మండలం రాజవోలు పాడులో గత నెల 20వ తేదీన ఇద్దరు కవలలు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. అయితే పాలు తాగిన వెంటనే అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పాలల్లో విషం కలిపిన విషయాన్ని గుర్తించారు వైద్యులు. అయితే తన భార్యే తన పిల్లలు హతమార్చింది అంటు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి గత కొంత కాలంగా కాపురంలో కలహాలు ఉండడంతో ఇక భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు భర్త వెంకటయ్య. వేరే వ్యక్తితో భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే అతనిలో అనుమానం అంతకంతకూ పెరిగి పోయింది. భార్య పై కోపంతో ఉన్నదిగా మారిపోయి పిల్లలు తాగే పాలల్లో విషం కలిపి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి