ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అనే చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే  నేటి రోజుల్లో అందరూ మోసగాళ్లే తప్ప మంచి వాళ్ళు అనే వారు ఉన్నారా ఆందోళన చెందుతున్నారు అందరూ. మాయ మాటలతోబురిడీ కొట్టించే నేరగాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సర్వే శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నాను అంటూ చెప్పాడు సదరు వ్యక్తి. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని వందలాది మంది దగ్గర డబ్బులు దండుకున్నాడు.చివరికి అతని బాగోతం బయటికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేసి కటకటాల వెనుకకు తోసారు. కర్ణాటక లోని శివాజీ నగర్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.


 ఉడుపి జిల్లా కుందారపు కు చెందిన రాఘవేంద్ర ప్రైవేట్ సర్వేయర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే ధనవంతుడు కావడం ఎలా అని ఆలోచించాడు. దీంతో అతని మనసులో ఒక ఆలోచన తట్టింది. దీంతో సక్రమంగా ఉన్న జీవితాన్ని గడపడం మానేసి వక్రమార్గం పట్టాడు. ఈ క్రమంలోనే కేంద్ర సర్వే శాఖలో డిప్యూటీ కమిషనర్ అంటూ నకిలీ గుర్తింపు కార్డులు కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన కారుకు భారత ప్రభుత్వం అంటూ ఒక బోర్డు కూడా వేసుకున్నాడు. ఈ క్రమంలోనే నిరుద్యోగుల ఆశలు ఆసరాగా చేసుకోవడం మొదలు పెట్టాడు. ఏకంగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేశాడు.


 అయితే ఇతగాడు మోసగాడు మాత్రమే కాదు నిత్య పెళ్లికొడుకు కూడా కావడం గమనార్హం. కుందాపుర లో ఏకంగా రహస్యంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఎంతో మంది ఉద్యోగుల దగ్గర్నుంచి దండుకున్న డబ్బుతో పలుచోట్ల ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. బాధితుల నుంచి వరుసగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపించారు. ఈ క్రమంలోనే కేటుగాడు మోసాలు రాసలీలలు మొత్తం బయటపడడంతో అతన్ని అరెస్టు చేసికటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: