మారుతున్న సమాజంలో మనిషి ఆలోచనా తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ మారుతుంది మూఢనమ్మకాలను వదిలేసి ఆధునిక సమాజం లోకి అడుగుపెడుతున్నాము అని అందరూ చెబుతున్నారు. అదే సమయంలో మానవతా విలువలను కూడా మనుషులు మర్చిపోతున్నారు అని నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది. కాలం మారుతుంది కాని ఆడపిల్లలకు రక్షణ మాత్రం ఎక్కడ ఉండటం లేదు. ఆధునిక సమాజంలో కూడా ఇంకా మానవమృగాలు ఆడపిల్లలను నయవంచన చేస్తూనే ఉన్నారు.


 ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారానికి పాల్పడుతూ ఎంతోమంది యువతుల జీవితాలను నాశనం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. మహిళలకు రక్షణ కల్పించడానికి ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా అవి మహిళలలో ధైర్యాన్ని భరోసాను కల్పించలేకపోతున్నాయ్. ముఖ్యంగా కామాంధులలో భయాన్ని కలిగించే లేక పోతున్నాయి. వెరసి రోజురోజుకు ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడటమే కాదు దారుణంగా హత్యలు సైతం చేస్తున్నారు మానవత్వం మరుస్తున్నా మానవ మృగాలు.



 ఇక రాజస్థాన్లోని అల్వార్ లో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. పదిహేనేళ్ల దివ్యాంగురాలుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఇక ప్రైవేటు భాగాల్లో పదునైన వస్తువులతో తీవ్రంగా గాయపరిచారు. ఇక బాధితురాలు స్పృహ కోల్పోవడంతో నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. మాలఖేడ్ గ్రామంలోని కల్వర్టు సమీపంలో చావుబతుకుల మధ్య ఉన్న బాలికను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక బాలిక తప్పిపోయింది అని ఫిర్యాదు ఇచ్చిన కుటుంబాన్ని పిలిచి బాలికను చూపించగా తమ కూతురే అంటూ బోరున విలపించారు తల్లిదండ్రులు. ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: