లోకం తీరు ఎటు పోతుంది.. నాగరిక  సమాజంలో అడుగుపెడుతున్న మనిషి మానవత్వాన్ని మరిచి ఉన్మాదిలా మారిపోతున్నాడా? బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చే మనిషి ఇప్పుడు మనిషి ప్రాణాలకు విలువ ఇవ్వడం లేదా? తల్లి ప్రేమ గురించి గొప్పగా చెప్పే మనిషి ఇక ఇప్పుడు కని పెంచిన తల్లి విషయంలోనే యమకింకరుడుగా మారిపోతున్నాడా అంటే ప్రస్తుతం అందరినోట సమాధానం అవును. నిజంగానే నేటి రోజుల్లో కని పెంచిన తల్లిదండ్రుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు కొంతమంది. ఆస్తుల కోసం కన్న వారిని హత్య చేసేందుకు వెనుకాడటం లేదు. మరి కొంతమంది చిన్న కారణాలకే క్షణికావేశంలో కని పెంచిన తల్లిదండ్రులు ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 కని పెంచిన తల్లిదండ్రుల ప్రాణాలకు విలువ ఇవ్వని మనిషి పరాయి మనుషుల ప్రాణాలు ఇంకేం విలువ ఇస్తాడు అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరు నెలకొని ప్రశ్న. ఇలా ఇటీవల కాలంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల పాలిట యమకింకరులు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అర్ధరాత్రి సమయంలో వ్యాయామం చేస్తూ ఉన్నాడు ఆ యువకుడు. ఇప్పుడు వ్యాయామం ఏంట్రా సైలెంట్ గా తిని పడుకో అంటూ మందలించింది తల్లి. అలా మందలించడంతో కోపంతో ఊగిపోయాడు ఆ యువకుడు. ఇక కన్న పేగు బంధాన్ని కూడా మరిచిపోయాడు. చివరికి కన్న తల్లిని దారుణంగా హతమార్చాడు. ఘటన హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రాంకోటి ప్రాంతానికి చెందిన కొండ పాపమ్మా అనే మహిళ కుమారుడు సుధీర్ కుమార్ తో కలిసి నివాసం ఉంటుంది. భర్తలేని పాపమ్మా కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తూ అటు కొడుకును కూడా చదివిస్తుంది.  మానసిక స్థితి సరిగా లేని సుధీర్ కుమార్ కు చికిత్స అందిస్తోంది. ఇటీవలే అర్ధరాత్రి సమయంలో సుధీర్ డంబెల్స్ తో వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. మెలుకువ వచ్చి  చూసిన తల్లి ఈ సమయంలో వ్యాయామం ఏంటి అంటూ మందలించింది. దీంతో కోపంతో ఊగిపోయిన సుధీర్ డంబుల్స్ తో  ఆమె తలపై దారుణంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన చెల్లిని కూడా కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. తల్లి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: