ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా భార్య భర్తల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధం తో ఏడడుగులు నడిచి ఒక్కటైనవారు కలకాలం కలిసి ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమను రాగాలను కలిగి  ఉంటారు. పెళ్లి చేసుకునేంత వరకు  ఒకరంటే ఒకరికీ ముక్కు మొఖం కూడా తెలియని వారు.. దాంపత్య బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఒక్కరంటే ఒక్కరికీ ప్రాణం గా మారి పోతూ ఉంటారు. ఇక దాంపత్య బంధం లో ఉండే అన్యోన్యతను చూసి ప్రతి ఒక్కరికి కూడా ముచ్చటేస్తూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..


 ఇటీవలి కాలంలో భార్యాభర్తల్లో ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించకపోయినా.. అక్కడక్కడా మాత్రమే దాంపత్య బంధానికి విలువ ఇస్తూ ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతున్నా భార్యాభర్తలు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అలాంటి వారి గురించే. వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా నిలబడ్డారు ఆ భార్య భర్తలు. ఇక ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేమూ అనేంతగా వారి మధ్య బంధం బలపడింది. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు..


 ఇక ఇప్పుడు చావులో కూడా కలిసి వెళ్లి పోయారు. చివరి క్షణాల్లో కూడా ఒకరి తోడు ఒకరు విడిచిపెట్టలేదు. సాలూరు పట్టణంలోని అల్లు వీధికి చెందిన దంపతులు అల్లు చిన్న (72) విజయమ్మ (68)భార్య భర్తలు ఒకే రోజు గంటల వ్యవధిలో మృతి చెందారు.. చిన్న కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇక భర్తకు విజయమ్మ అన్నిరకాల సేవలు చేస్తుంది. ఆరోగ్యం విషమించి వేకువజామునే మృతిచెందాడు చిన్న. భర్తే ప్రాణంగా బ్రతికిన విజయమ్మ ఆయన లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.  అరణ్యరోదనగా విలపిస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాదం నిండిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: