సాధారణంగా ఒక యజమాని తన కంపెనీలో ఉన్న ఉద్యోగులను ఎవరికి ఉంచాలి.. ఎవరిని ఉద్యోగం నుండి తీసేయాలి అని పూర్తి అవగాహనా కలిగి ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఒకవేళ ఒక ఉద్యోగి ప్రవర్తన గాని అతని పనితనం గాని నచ్చకపోతే ఇక వెంటనే అతని ఉద్యోగం నుంచి తొలగించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఉద్యోగం నుంచి తొలగించబడిన  వ్యక్తి ఎవరైనా సరే మరో ఉద్యోగం వెతుక్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అలా చేయలేదు.. తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకు గాను ఏకంగా యజమాని పైన కక్ష పెంచుకున్నాడు.


 ఎలాగైనా యజమానిపై పగ తీర్చుకోవాలి అని భావించాడు. ఈ క్రమంలోనే ఏకంగా యజమానికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా ఉద్యోగం తొలగించాడు అన్న కోపంతో యజమాని ఇంటిని ధ్వంసం  చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే సంఘటనా స్థలానికి పోలీసులు రాకముందే నిందితుడు ఇంటిని పూర్తిగా ధ్వంసం చేయడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన కెనడాలో  వెలుగులోకి వచ్చింది. కాల్గరీ లో సరస్సు పక్కన ఉన్న ఒక ఇంటిని ధ్వంసం చేశాడు. దీన్ని మళ్లీ నిర్మించలేరూ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు  ఉద్యోగం నుంచి తొలగించబడిన ఉద్యోగి.


 అయితే సదరు ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేసి భారీగా జరిమానా విధించారు అన్నది తెలుస్తుంది. ఇక సదరు నిందితుడిని త్వరలో కోర్టులో కూడా హాజరు పరిచ పోతున్నారట. అయితే ఇదే విషయంపై స్పందించిన యాజమాని ఇలా జరుగుతుందని ముందే ఊహించానని.. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు వేరే ఉద్యోగం చూసుకుంటారు కానీ ఇలాయజమాని పై పగ బట్టి ఇల్లు ధ్వంసం చేయడమంటే సంచలనం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: