ప్రేమ పెళ్లి అనేది ప్రతి ఒక్క మనిషి జీవితం లో ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే ప్రేమ విషయంలో తప్పటడుగులు వేస్తే జీవితం మొత్తం బాధపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అదే పెళ్లి విషయం లో తప్పటడుగులు వేస్తే ఇక బ్రతికినన్ని నాళ్ళు నరకం అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే యువత ప్రేమ, పెళ్లి విషయం లో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవలకాలంలో మాత్రం ఎంతోమంది యువకులు ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఉన్మాదులుగా మారిపోతున్న ఘటనలు  వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 తమకు నచ్చిన అమ్మాయి తమను ప్రేమించడం లేదని వెంటపడుతున్న కొంతమంది యువకులు.. ఇక సదరు యువతీ ప్రేమను నిరాకరించడంతో ఉన్మాదులుగా మారిపోతున్నారు. అప్పుడు వరకు నువ్వే ప్రాణం అంటూ వెంటపడిన వారు ప్రేమను తిరస్కరించిన యువతి ప్రాణాలను దారుణంగా తీసేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్న ఘటనలు కోకోళ్లలుగా వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి.


 తనతో పాటు పీహెచ్డీ చదువుతున్న తోటి విద్యార్థి  పెళ్లికి నిరాకరించింది అన్న కారణంతో ఏకంగా యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ ఘటన వెలుగు చూసింది. తోటి విద్యార్థి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. మంటలు చెలరేగుతుండగా వెళ్లి అమ్మాయిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఇద్దరికీ 90% కాలిన గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: