
నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే మాత్రం చివరికి పెళ్లయిన కొన్నేళ్లకే బంధం కాస్త పెటాకులుగా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంతోమంది యువతీ యువకులు ఇలా పెళ్లి చేసుకున్న తక్కువ సమయంలోనే చిన్న చిన్న గొడవల కారణంగా చివరికి దాంపత్య బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్న ఘటనలు కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక మరి కొంతమంది ఇలా పెళ్లి కారణంగా జీవితం నాశనమైంది అనే మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అందరిని అవల్లయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. పెళ్లయిన తొమ్మిది నెలలకే భార్య విడాకులు కావాలి అని కోరడంతో ఎంతో మనస్తాపం చెందాడు భర్త. ఇక ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం గంగాధర్ పల్లి గ్రామంలో వెలుగు చూసింది. ఏకంగా వెంకటేశం అనే 24 ఏళ్ల యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తూప్రాన్ మండలం దమ్మక్కపల్లి కి చెందిన లాస్యను పెళ్లి చేసుకున్నాడు వెంకటేశం. అయితే పెళ్లి అయిన మూడు నెలల నుంచి గొడవలు మొదలయ్యాయి. చివరికి విడాకులు తీసుకోవాలని లాస్య నిర్ణయించడంతో మనస్థాపంతో వెంకటేశం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.