దేశంలో లైంగిక దాడి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఒకప్పుడు ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి లైంగిక దాడి చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పక్కన కుటుంబ సభ్యులు ఉన్న వారిపై దాడి చేసి మరీ అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మృగాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది అని చెప్పాలి. అయితే కొంతమంది ఇలా ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తుంటే ఇంకొంతమంది మరింత బరితెగించి ఏకంగా మగాళ్ళపై కూడా అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇంకొంతమంది పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులు దొరక్కపోతే ఏకంగా పశువులపై కూడా అత్యాచారం చేస్తున్న ఘటనలు సభ సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని రాజువారిపల్లెలో పశువులపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు ఒక వ్యక్తి. రాత్రి వేళలో లేక దూడలపై  ఇలా లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు స్థానికులు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కూడా ఆ నీచుడు దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో ఇలాంటి దారుణమైన మనుషులు కూడా ఉన్నారా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: