ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన దొంగల బెడద కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్న చివరికి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు జనాలు. ఇలా చోరీలు చేసి అందిన కాడికి దోచుకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తరచూ ఎక్కడో చోట చోరీకి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే మొన్నటి వరకు తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో మాత్రమే చోరీకి పాల్పడేవారు.


 రహస్యంగా ఇంట్లోకి చొరబడి ఇక విలువైన వస్తువులు ఎక్కడున్నాయో అన్న విషయాన్ని కనుక్కొని అందిన కాడికి దోచుకుపోయేవారు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది దొంగలు చోరీలు చేయడంలో కూడా క్రియేటివిటీ చూపిస్తున్నారు. కేవలం ఇళ్లల్లో చోరీ చేయడం మాత్రమే కాదు ఏకంగా వాహనాల చోరీ కూడా చేస్తూ ఉన్నారు. ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలను ఎంతో చాకచక్యంగా ఎత్తుకుపోతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  కానీ ఈ ఘటన గురించి తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.



 ఎందుకంటే ఇప్పుడు వరకు సినిమాల్లో కూడా మీరు ఇలాంటి కామెడీ సీన్ చూసి ఉండరు. యూపీలోని కాన్పూర్ లో ఈ విచిత్రమైన దొంగతనం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముగ్గురు వ్యక్తులు ఏకంగా కారును దొంగలించారు. అదేంటి కారును దొంగలిస్తే అది జోక్ ఎలా అవుతుంది అనుకుంటున్నారు కదా.. అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు కారును దొంగలించేందుకు వెళ్ళగా ఈ ముగ్గురిలో ఎవరికీ కూడా డ్రైవింగ్ రాదు. దీంతో ఎలాగైనా కారును దొంగలించాలి అనుకొని 10 కిలోమీటర్ల పాటు కారును నెట్టుకుంటూ వెళ్లారు. ఇక అలసిపోయిన దొంగలు కార్ నెంబర్ ప్లేట్ పీకేసి కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు గమనించి వారిని పట్టుకున్నారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఈ విషయం తెలిసి ఎంతోమంది నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: