
ఎందుకంటే కరోనా వైరస్ కు భయపడి అందరూ ఇంటిపట్టునే ఉంటే డాక్టర్లు మాత్రం కుటుంబాన్ని సైతం వదిలేసి ఇక అందరి ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించారు. దీంతో ఇక వైద్యులపై ఉన్న గౌరవం మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం కొంతమంది వైద్యులు ఏకంగా నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా నిర్లక్ష్య వైఖరితో పేషంట్ల ప్రాణాల మీదకి తీసుకొస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవల నేపాల్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది.
ఖాట్మండులో ఒక డాక్టర్ నిర్వాకం ఏకంగా 22 ఏళ్ళ యువకుడి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక ఘర్షణలో కత్తిపోటు గాయాల పాలైన వ్యక్తిని ఇక కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే డాక్టర్ కుట్లు వేసి ఇంటికి పంపించాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొన్ని గంటలకు మళ్ళీ నొప్పి పెరగడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే స్కానింగ్ చేసి చూడక ఏకంగా ఆ యువకుడు కడుపులో 15 సెంటీమీటర్ల పొడవైన కత్తి ఉండడంతోఅందరూ షాక్ అయ్యారు. ఇక డాక్టర్లు మళ్ళీ సర్జరీ చేసి కడుపులో ఉన్న కత్తిని బయటకు తీశారు.