అమెరికాకు చైనా సవాళ్లు విసురుతూనే ఉంది. డ్రాగన్ కంట్రీ తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షను పెంచుకుంటూ కనిపించిన ప్రతి దేశంతో గొడవ పెట్టుకుంటూనే ఉంటోంది. జపాన్ సముద్ర జలాల్లో, ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో పిలిఫ్పీన్, తైవాన్, ఇండియా, ఇలా అన్ని దేశాల సరిహద్దుల వద్ద చైనా గొడవలకు దిగుతోంది. దీనికి తోడు ఏకంగా అమెరికాలోకి కొత్త తరహ బెలూన్లను విడిచిపెట్టి ఏమీ తెలియనట్లు వ్యవహరించింది. ప్రస్తుతం అమెరికాకు తల నొప్పిగా మారింది. అమెరికాను కాదని ప్రపంచ పెద్దన్న చైనా ఉండాలని భావిస్తోంది. దీనికి కారణం అన్ని రకాలుగా అభివృద్ది చెందడమే. చైనా అణ్వాయుధాలను పెంచుకుంది.


ఆర్థికంగా ఎక్కువగా బలపడి ఇతర దేశాలకు చాలా రకాలుగా అప్పులు ఇచ్చింది. అవి తీర్చకుంటే వారి దేశాల్లోనే కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, నౌకాశ్రయాలు పెడుతూ విస్తరణ వాదాన్ని చాటుకుంటోంది. ప్రస్తుతం ఇదే విషయంలో అమెరికాను కూడా చైనా పదే పదే ఆయా విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో అమెరికా ఎలాగైనా చైనాకు చెక్ పెట్టాలని ఆశిస్తోంది. దీనికి ఇండియానే సరైనదేనే భావన అమెరికా అధికారుల్లో నెలకొంది. వివిధ దేశాల భౌగోళిక సరిహద్దుల వద్ద చైనా అల్లర్లకు పాల్పడుతూ.. దురాక్రమణ చేస్తోంది. భారత్ పై కూడా ఇలాగే గాల్వాన్ లోయ సరిహద్దు వద్ద దాడులకు దిగింది.


దీన్ని ఇండియా సైన్యం తిప్పి కొట్టింది. మూడు సార్లు దురాక్రమణ చేపట్టేందుకు వచ్చిన డ్రాగన్ కంట్రీ సైనికులకు బుద్ధి చెప్పి పంపించారు. భారత సైనికులు. ఇలా చైనాకు ధీటుగా నిలబడగలిగే దేశాల్లో భారత్ ఉందని అమెరికా గ్రహించింది. భారత్ కు ఎలాగైనా ఆర్థిక, సైనిక పరంగా బలంగా తయారు చేస్తే వచ్చే కాలంలో చైనాను ఎదుర్కొనే శక్తి భారత్  వశం అవుతుందని భావిస్తోంది. దీని కోసం అమెరికా ఆయుధాలను, అణ్వస్త్రాలను, ఆర్థిక పరమైన అంశాల్లో తోడ్పడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: