పాపం ఎల్లోమీడియా బాధ, కడుపుమంట ఇంతని ఎవరు చెప్పలేకున్నారు. 24 గంటలూ జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్ప  ఎల్లోమీడియాకు వేరే పనేలేదన్నట్లు తయారైంది. తాజాగా ఢిల్లీలో బిజెపి అధికారప్రతినిధి, లాయర్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ పేరుతో ఓ ఇంటర్వ్యూ అచ్చేసింది. జగన్ పై తాను చేస్తున్న ఆరోపణలను, విమర్శలను జనాలు పట్టించుకోవటం లేదని అర్ధమైపోయినట్లుంది. ఇక టీవీల్లో కూడా ప్రతిరోజు పెద్ద డిబేట్ అంటూ ఒకటి నిర్వహిస్తోంది. ఇందులో జగన్ను తిట్టటమే పనిగా పెట్టుకున్న కొందరిని పోగేసి వాళ్ళలో ఓ గంటపాటు నోటికొచ్చినట్లు తిట్టిస్తోంది. దినపత్రిక, టీవీ అజెండా జనాలకు అర్ధమైపోవటంతో వీటిని పట్టించుకోవటం మానేశారు. దాంతో జగన్ కు వ్యతిరేకంగా తాము ఎంత గొంతుచించుకున్నా జనాలను నమ్మించలేమని అర్ధమైపోయింది.




అందుకనే వివిధ రంగాల్లో ప్రముఖులంటూ కొందరితో జగన్ను తిట్టించే, బురద చల్లించే పనికి పూనుకున్నట్లు అనుమానంగా ఉంది. ఇందులో భాగంగానే అశ్వినీకుమార్ తో ఓ ఇంటర్వ్యూ ప్రచురించింది. ఆయన మాట్లాడుతూ ఏపి అసెంబ్లీ అందరికన్నా ఎక్కువ క్రిమినల్ ఆరోపణలు,  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అంటూ చెప్పారు. ఆంధ్రప్రజలు ఆయన్ను ఎందుకు ఎదుర్కున్నారో ఈయనగారికి అర్ధం కాలేదట. బహుశా జగన్ పై ఉన్న ఆరోపణలు ప్రజలకు తెలీకపోవటం వల్లే ఎన్నుకునుంటారని కూడా ఈ లాయర్ సమాధానం అభిప్రాయపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎల్లోమీడియా ప్రకారం ఈ లాయర్ చాలా ప్రముఖుడు.




మరి ఇంత ప్రముఖుడు, న్యాయశాస్త్రంలో దిట్టయిన అశ్వినీకుమార్ కు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నేరచరితులే అని ఎలా నిర్ణయానికి వచ్చాడో అర్ధంకాకుండా ఉంది. మరి ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబునాయుడు ఎందుకు గుర్తుకురాలేదు. అధికారంలో ఉన్న టిడిపిని కాదని జనాలు జగన్ కు అఖండ మెజారిటితో ఎన్నుకున్నారంటేనే చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉందో అర్ధంకావటం లేదా ? పైగా జగన్ పై ఉన్న ఆరోపణలు జనాలకు తెలీకే ఎన్నుకున్నారని అభిప్రాయపడటమే విచిత్రంగా ఉంది.  జగన్ పై సిబిఐ దర్యాప్తు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణను ఎల్లోమీడియా పారలల్ గానే జనాలకు ఏరోజుకారోజు చేరవేసిన విషయం పాపం ఈ లాయర్ కు తెలీదేమో.




సిబిఐ, ఈడి, ఐటి సంస్ధలు తమ విచారణలో ఏమీ తేల్చకపోయినా చంద్రబాబు+ఎల్లోమీడియా కలిసి జగన్ లక్షకోట్లు తినేశాడనే ముద్ర వేసిన జనాలకు తెలీదా ? సంవత్సరాల తరబడి జగన్ అత్యంత అవినీతిపరుడంటూ ప్రత్యేకించి కథనాలు వండి వార్చిన విషయం జనాలకు తెలీదనే ఈ లాయర్ అనుకుంటున్నాడా ? అంటే లాయర్ ఉద్దేశ్యంలో తెలుగు ప్రజలు టీవీలు చూడరు, పేపర్లు చదవరని అనుకుంటున్నాడా ?  ఆరోపణలు వేరు, కోర్టుల విచారణలో అవినీతిపరుడని నిర్ధారణ అవ్వటం వేరన్న విషయం లాయర్ మరచిపోయినట్లున్నాడు. అందుకనే ఎల్లోమీడియా జగన్  తనలో పేరుకుపోతున్న కసినంతా లాయర్ తో ఇంటర్వ్యూ రూపంలో మొదటి పేజీలో ప్రచురించింది.




ఇక చంద్రబాబు విషయానికి వస్తే వైసిపి నేతల ఆరోపణల ప్రకారమే సుమారు 16 కేసుల్లో స్టేలపై కంటిన్యు అవుతున్న విషయం బహుశా ఈ లాయర్ కు తెలీదేమో. దశాబ్దాల పాటు తనపై నమోదైన కేసులను విచారణకు కూడా రానీయకుండా చంద్రబాబు అడ్డుకోవటంలో ఉద్దేశ్యం ఏమిటో కూడా అశ్వినీకుమార్ చెబితే బాగుండేది. చంద్రబాబు ఏస్ధాయిలో పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడుతున్నాడో  స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడినే బహిరంగసభలో చెప్పిన విషయం ఈ లాయర్ కు తెలీదేమో. మొత్తంమీద లాయర్ ఇంటర్వ్యూని చూస్తే ఇదేదో ప్రత్యేకించి ఎల్లోమీడియానే జగన్ పై ఆరోపణలు చేయించినట్లు అర్ధమైపోతోంది. నిజంగానే అశ్వినీకుమార్ ఏపిలో పరిస్ధితుల గురించి మాట్లాడాలంటే వాస్తవ పరిస్ధితులు తెలుసుకుని మాట్లాడుంటే బాగుండేది.



మరింత సమాచారం తెలుసుకోండి: