తెలుగుదేశంపార్టీకి ఏపిలో కూడా చివరిరోజులు వచ్చేసినట్లే ఉంది. తాజాగా ఎల్లోమీడియాలో వచ్చిన కొ(చె)త్తపలుకులో రాసిన విషయాన్ని చదివిన వారికి ఎవరికైనా ఇదే అనుమానం రావటం ఖాయం. కొత్తపలుకులో అనేక అంశాలున్నప్పటికీ మత రాజకీయాలపై కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలున్నాయి.  తమ వ్యాఖ్యలను, కథనాలను జనాలు నమ్మటం లేదని తెలిసినా అవే వ్యాఖ్యలను పదే పదే రిపీట్ చేస్తూపోవటమే ఎల్లోమీడియా ప్రత్యేకం. ఇందులో భాగంగానే చంద్రబాబునాయుడుపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవేమిటంటే జగన్+బిజెపిని ఎదుర్కొనే విషయంలో చంద్రబాబు కూడా హిందువుల తరపున పోరాటం చేయటానికి సిద్ధపడ్డారట.




అంటే జగన్ పై పోరాటం చేయటానికి చంద్రబాబుకు ఎటువంటి అంశాలు అక్కరకు రావటం లేదు. జగన్ పై ప్రయోగిస్తున్న అస్త్రాలేవి పనిచేయటం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయం దెబ్బకు ఏమి చేయాలో చంద్రబాబుకు దిక్కుతోచటం లేదు. దానిమీద జగన్ చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనతో పార్టీ రాష్ట్రం మొత్తం కుదేలైపోయింది. అసలే మొన్నటి ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీ మీద జగన్ ప్రతిపాదన మూలిగే నక్కపై తాటిపండు పటినట్లైంది. అప్పటి నుండి జగన్ను రాజకీయంగా ఎలా దెబ్బ కొట్టాలా ? ఆలోచనతో చంద్రబాబు ఎన్ని మాయలు చేస్తున్న ఫలించటం లేదు. అందుకనే చివరి అస్త్రంగా చంద్రబాబు హిందుమతం ఉద్దారకుని అవతారమెత్తారు. సరే ఇది కూడా ఫలించలేదనుకోండి అది వేరే సంగతి.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ సహకారంతోనే హిందుత్వ ఎజండాను రాష్ట్రంలో విస్తరింపచేయాలన్నది బిజెపి వ్యూహంగా అనుకుంటున్నట్లు ఎల్లోమీడియా బయటపెట్టింది. ఇక్కడ తన మనసులోని ఆలోచనను అందరిపైనా ఎల్లోమీడియా రద్దుతోంది. ఏ ముఖ్యమంత్రయినా తనంతట తానుగా మరో ప్రతిపక్షం బలపడేందుకు ఊతమిస్తాడా ? అన్నది సింపుల్ లాజిక్. నిజానికి రాష్ట్రంలో బిజెపికి ఉన్నదేమీ లేదు కొత్తగా పోవటానికి. గట్టిగా చెప్పాలంటే 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను కూడా పోటికి పెట్టేస్ధితిలో లేదు బిజెపి. ఇటువంటి బిజెపితో హిందుత్వ ఎజండాను అమలు చేసేందుకు జగన్ ఎందుకు చేతులు కలుపుతాడు ?




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్, బిజెపిలు ఏకమవ్వాలన్నది ఎల్లోమీడియా ఆలోచన. అప్పుడు జగన్ పై మత రాజకీయాల ముద్రవేసి హిందువేతరులకు దూరం చేయాలన్నది ఎల్లోమీడియా ఉద్దేశ్యం. కానీ వాళ్ళనుకుంటున్నట్లు ఎక్కడా  జరగటం లేదు. ఇదే ఆరోపణలను నంద్యాల ఉపఎన్నికల్లోనే కాకుండా మొన్నటి ఎన్నికల్లో కూడా పదే పదే ఎల్లోమీడియా ప్రచారం చేసినా ఎవరు నమ్మలేదు. కాబట్టి ఎల్లోమీడియా రాసిన రాతలను జనాలు ఎప్పటికీ నమ్మరు. ఒకవైపు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఎన్ని అవస్తలు పడుతున్నాడో అందరు చూస్తున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే బిజెపితో పొత్తుకు జగన్ ప్రయత్నాలంటూ రాస్తే జనాలు నవ్వుతారన్న కనీస ఇంగితం కూడా లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: