మీడియా స్వేచ్చ, ప్రభుత్వం కక్షసాధింపు అనే అంశంపై రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లోమీడియా సుప్రింకోర్టులో వేసిన పిటీషన్ ఎంత డొల్లగా ఉందో అర్ధమైపోతోంది. వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ అధికారులు కేసులు నమోదుచేయటం, అరెస్టు, జైలు, మిలిట్రీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు అందరికీ తెలిసిందే. పనిలో పనిగా ఇదే కేసులో ఏబీఎన్ ఆంద్రజ్యోతి-టీవీ5 పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదుచేసింది.  రెండు యాజమాన్యాలపై ఎఫ్ఐఆర్ నమోదైన ప్రస్తుతానికి వాటిపై యాక్షన్ విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ కనబడలేదు. రఘురామకు పట్టిన గతే తమకు కూడా పడుతుందేమో అనే భయంతోనే ఏబీఎన్, టీవీ 5 యాజమాన్యాలు ముందు జాగ్రత్తగానే సుప్రింకోర్టులో పిటీషన్లు వేశాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దీని తర్వాత ఏబీఎన్ యాజమాన్యం ప్రభుత్వంపై కోర్టు ధిక్కారం అంటు మరో కేసు వేసింది.




రెండోసారి వేసిన పిటీషనే చాలా విచిత్రంగా ఉంది. కోర్టు థిక్కార పిటీషన్ ప్రకారం కరోనా వైరస్ నియంత్రణలో ఎంపి చేసిన వ్యాఖ్యలను తాము ప్రసారం చేసిన కారణంగానే తమపై ప్రభుత్వం కేసు నమోదు చేసినట్లు చెప్పింది. కరోనా వైరస్ వార్తలు, కథనాల ప్రసారం విషయంలో సుప్రింకోర్టు ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం థిక్కరించింది కాబట్టి కోర్టు థిక్కారం కేసు వేసినట్లు చెప్పుకుంది. ఏబీఎన్ వేసిన రెండో పిటీషన్ చూస్తే వాళ్ళ వాదనలు ఎంత డొల్లతనంగా ఉందో అర్ధమైపోతోంది. రఘురామ మీద ప్రభుత్వం పెట్టిన కేసులు రాజద్రోహం చేశారని. ప్రభుత్వాన్ని+ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించారని. సీఎం, ప్రభుత్వంపై దురుద్దేశపూర్వకంగా దూషించేందుకు ఎంపికి పై రెండు ఛానళ్ళు ప్రత్యేకంగా స్లాట్ లు కేటాయించాని సీఐడీ ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా చెప్పింది.




తమ ఛానళ్ళల్లో ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టించే కార్యక్రమాన్ని ఎంపితో కలిసి రెండు ఛానళ్ళు కుట్రపన్నినట్లు సీఐడీ ఆరోపించింది. తన ఆరోపణలకు ఆధారాలుగా 46 సీడీలను కూడా కోర్టుకు అందించింది. ఎంపి, రెండు ఛానళ్ళకు వ్యతిరేకంగా సీఐడీ ఆరోపణలు ఇంత స్పష్టంగా ఉంటే ఏబీఎన్ మాత్రం పిచ్చి వాదన మొదలుపెట్టింది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందనే వార్తలను ప్రసారం చేసినందుకు తమపై ప్రభుత్వం కక్షసాధింపుకు దిగిందని కోర్టునే తప్పుదోవ పట్టిస్తోంది. ఇక్కడ సమస్య కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణ కానేకాదు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ఎంపితో కలిసి రెండు ఛానళ్ళు కుట్రకు పాల్పడ్డాయని, భాగస్వాములయ్యారన్నదే సీఐడీ ఆరోపణ. నిజంగా ఎల్లోమీడియా వాదనలో దమ్ముంటే సీఐడీ వాదనలు తప్పని నిరూపించుకోవాలి. అంతేకానీ అసలు కేసునే తప్పుదోవ పట్టించేట్లుగా కోర్టు థిక్కారం పిటీషన్ వేయటమే విచిత్రంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: