పీకే.. ప్రశాంత్ కిషోర్ ఒక ఎనలిస్ట్ . ఏ కులం వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆయన లెక్కలు  అందిస్తూ ఉంటాడు. అలాగని ఈ లెక్కలు తెలుగుదేశం పార్టీ దగ్గర వైఎస్ఆర్సిపి పార్టీ దగ్గర అన్ని పార్టీల దగ్గర కూడా ఉంటాయి. అసలు మరి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిన పని ఏంటంటే.. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓట్లు వేస్తారు, ఓట్లు వేస్తే తమ కులం వాడికి వేస్తారా లేక మరో కులం వారికి వేస్తారా అనే లెక్కలను.. జగన్మోహన్ రెడ్డికి అందించారు. ఆ తర్వాత నిర్ణయం జగన్మోహన్ రెడ్డి  తీసుకున్నారు. రఘురామకృష్ణంరాజు విషయంలో కూడా జగన్ నిర్ణయమే ఫైనల్ అయింది..కానీ ప్రశాంత్ కిషోర్ ది కాదు.


ఏ వర్గం వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు అనే విషయం మాత్రమే ప్రశాంత్ కిషోర్ అందించారు, ఆ తర్వాత జగన్ తన సొంత నిర్ణయంతోనే గెలిచారు తప్ప అది ప్రశాంత్ కిషోర్ గెలిపించడం కాదు. అలా అనుకోవడం నిజంగా మూర్ఖత్వమే. కానీ రాధాకృష్ణ వంటి కొందరి నోట్లో నుంచి పదేపదే వచ్చే వ్యక్తి పేరు మాత్రం ఇదే.. ప్రశాంత్ కిషోర్ అని. ఆయన వల్లే జగన్ కి ఓట్లు వచ్చాయని, ఆయనే జగన్ని గెలిపించేసాడని అనుకునే మూర్ఖత్వం అది.


అలాగంటే.. మరి టిడిపికి కూడా.. రాబిన్ శర్మ వంటి వారు ఉన్నారు కదా మరి వీళ్ళు ఎవరు..? టిడిపికి పొలిటికల్ స్ట్రాటజిస్టులు కాదా? ఇక కాంగ్రెస్ స్ట్రేటజిస్టు సునీల్ కనుగోలకైతే తెలంగాణ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త వ్యక్తి శాంతను సింగ్. 2017లో వైఎస్ఆర్సిపి వద్ద వర్క్ చేసిన ఈయన కొత్తగా టిడిపిలోని రాబిన్ శర్మ టీం లో జాయిన్ అయ్యారట. ఈయన కాన్పూర్ ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత సింగపూర్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారట. వైయస్సార్సీపి పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్లు ఉన్నారు.. ఉండకూడదు అనుకుంటే.. గతంలో మోడీ కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్లును పెట్టుకున్నారు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: