మాజీ హోం మంత్రి సుచరిత.. నేను ఉన్నంతకాలం జగన్ వెంటే ఉండాలని అనుకున్నాను.. కానీ నా భర్త మాత్రం వేరొక పార్టీలోకి వెళ్తే.. నేను ఒక పార్టీ నా భర్త ఒక పార్టీ అయిపోతాం కాబట్టి అది కరెక్ట్ కాదు  కదా అంటూ వ్యాఖ్యలు చేయడలం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్య తాజాగా రాజకీయాల్లో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. హోం మంత్రిగా  వేరే ఇన్చార్జిని పెట్టి సుచరితను తప్పించినప్పుడు అక్కడ జరిగినటువంటి  గొడవను బట్టి అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న విషయం  తెలుస్తుంది.  


ఆల్రెడీ ఇన్కమ్ టాక్స్ లో పనిచేసే సుచరిత భర్త  రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. దానికి కారణం గతంలో ఆయనకు  ఆంధ్రలో పోస్టింగ్  ఇచ్చి కూడా   లోకల్ వాళ్లకు లోకల్ లో పోస్టింగ్ వేయకూడదని ఆయన్ని అర్జెంటుగా బదిలీ చేయించారు.. దాంతో ఆయనకి తీవ్రంగా కోపం వచ్చింది.  రాజకీయ పలుకుబడితో ఏమైనా చేస్తారా అని ఆలోచించిన ఆయన తాను కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాపట్ల ఎంపీ సీటు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.


ప్రస్తుతం ఇన్కమ్ టాక్స్ లో వర్క్ చేస్తున్న ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఈ రకంగా ప్రయత్నించడానికి సిద్ధమవుతున్నారు. కానీ నందిగామ సురేష్, బాపట్ల సిట్టింగ్ ఎంపీగా  ఉన్న నేపథ్యంలో అది ఇవ్వడానికి  జగన్ సిద్ధంగా లేరు. తాజాగా భార్యాభర్తలకు తెలుగుదేశం పార్టీ  ప్రతిపాడు నుంచి సుచరిత కు.. బాపట్ల నుంచి  ఆమె భర్తకు టికెట్లు ఆఫర్ చేయడానికి చూస్తోంది. ఈ రెండు చోట్ల ప్రాబ్లమ్స్ ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.


ప్రతిపాడులో ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటి  నుంచి సరైన నాయకులు లేరు. అలాంటి ప్లేస్ లో బలమైన నాయకురాలు ఉంటే మంచిదని ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ మొన్నటిదాకా వైఎస్ఆర్సిపి పార్టీని వీడేది లేదు అని చెప్పిన సుచరిత తాజాగా తన భర్తరూట్ లోనే వెళ్లాలని మాటను మార్చుకున్నట్టు కనిపిస్తుంది. మరి ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: