ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఎన్నికలు రాకముందే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  జగన్ ను ఓడగొట్టాలంటే జనసేన అధ్యక్షుడు తీసుకొస్తున్న ప్రధాన అంశం. బీజేపీ, టిడీపీ, జనసేన కలిసి పోటీ చేసి వైసీపీని ఓడించాలని అనుకుంటున్నారు. కానీ బీజేపీ ఎలాంటి సమయంలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ససేమిరా అంటోంది. రాష్ట్రంలో ఓంటరిగానైనా పోటీ చేస్తాం. కానీ టీడీపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం లేదని బీజేపీ చెబుతోంది.


జనసేన మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుని ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుతో ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు జనసేన ఎన్నికల్లో నిలబడలేదు. కానీ పరోక్షంగా ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చింది. ఇదే విషయంలో ప్రస్తుతం కూడా జనసేన అదే విధంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తేలికగా వైసీపీని ఓడించవచ్చని అనుకుంటుంది. దీనికి బీజేపీ అసలు అంగీకరించడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని 5 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచాక, మధ్యలో వివాదాలతో టీడీపీ, బీజేపీ రెండు పరస్పరం శత్రువులుగా మారాయి.


ఒకవేళ జనసేన ఇప్పుడు కనుక ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోతే వాళ్లకు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి లాగా మారే అవకాశం ఉంటుంది. కానీ మూడు, నాలుగు సార్లు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే కష్టమే. వైసీపీ పార్టీ 2014లో 40కి పైగా ఎమ్మెల్యే స్థానాల్లో గెలిస్తే, 2018 లో 150 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటికే 10  సంవత్సరాలవుతోంది జనసేన పార్టీ పుట్టి.. ఇప్పటి వరకు కేవలం ఆ పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే నే గెలిచారు. పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో ఓడిపోయారు. ప్రస్తుతం రాబోయే సాధారణ ఎన్నికలు మాత్రం జనసేనకు పెద్ద పరీక్షే అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: