ఇండియా టుడే, సీఎన్ఎన్ తాజాగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారనే సర్వేను దేశ వ్యాప్తంగా నిర్వహించారు. దీనిలో మళ్ళీ మోడీ ప్రభుత్వం వస్తుందని, రాహుల్ గాంధీ కంటే కేజ్రివాల్, మమత బెనర్జీ లా ప్రాధాన్యత పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సర్వే కీలక అంశాలను వెల్లడించింది.


జగన్ కు మళ్ళీ ప్రజలు పట్టం కడతారని తెలిపారు. దాదాపు ఇండియా టుడే సిఎన్ఎన్ వారు 1,40,000 మందితో నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం తెలిసింది. జగన్ ప్రభుత్వం గత ఎన్నికల్లో 23 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కానీ వచ్చే సాధారణ ఎన్నికల నాటికి అవి 15 స్థానాలకు పడిపోతాయని అదే సమయంలో మూడు ఎంపీ స్థానాలు గెలిచిన తెలుగుదేశం 10 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలో వెళ్లడైనట్టు ఇండియా టుడే తెలిపింది.


అదే విధంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా జగన్ వైసీపీ పార్టీకి తగ్గుతాయని కానీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలో తేలింది. 150 స్థానాలకు పైగా ఉన్న వైసీపీ 110 నుంచి 120 వరకు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా టిడిపికి ప్రస్తుతం 23 స్థానాలు ఉంటే వచ్చే ఎన్నికల్లో 60 నుంచి 65 ఎమ్మెల్యే స్థానాలు వరకు గెలుచుకుంటారని అంచనాలు తెలుపుతున్నాయి. ఏదేమైనా గత ఎన్నికల నాటికి ఇప్పటికి ప్రజల్లో మార్పు అనేది కచ్చితంగా కనిపిస్తుందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే తెలుగుదేశం వైసిపి పార్టీలకు ఒక హెచ్చరిక లాంటిది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రజల నాడిని అందుకోలేకపోయినా వైసిపి అధికారాన్ని నిలబెట్టుకోలేక పోతుంది. ఒకవేళ టిడిపి కూడా ప్రభుత్వ వైఫల్యాలను సరైన విధంగా కనిపెట్ట లేకపోతే, ప్రజల వద్దకు చేర్చలేక పోతే టిడిపి మళ్ళీ ప్రతిపక్షం లో కూర్చోవాల్సి ఉంటుంది. మరో విషయం ఐప్యాక్ వాళ్ళు రాసుకొచ్చిన అంశం ఏమిటంటే మంత్రులందరూ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారన్నది మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: