
లేబర్ లా ప్రకారం.. ఒక కార్మికుడిని తీసేయాలంటే వారికి సరైన సమాధానం చెప్పాలి. తీసేసే ముందు రెండు నెలల జీతమివ్వాలి. అయినా వారిని తీసేయడానికి చట్టం ఒప్పుకోదు. కానీ సాప్ట్ వేర్ రంగంలో మాత్రం ఈ రోజు డ్యూటీ చేయొచ్చు. రేపు డ్యూటీ ఉంటుందని చెప్పే లోపు రేపటి నుంచి జాబ్ పోవచ్చు. ఎవరూ కూడా అడిగేవారు ఉండరూ. కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలకు సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం విదేశాల్లో అయితే ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. దీంతో పెట్టే బేడా సర్దుకుని తిరుగు ప్రయాణం కావాల్సిన పరిస్థితి. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని చెబుతున్న కారణం ఒక వైపు. మరోటి కరోనా సమయంలో నియమించుకున్న వారి అవసరం ఇప్పుడు లేదు.
ఇలా ఒకేసారి ఎంతో మంది ఉద్యోగాలు పోతున్నాయి. మరి దాారుణమైన విషయం ఏమిటంటే భార్యా భర్తలు ఇద్దరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే వారిద్దరి ఉద్యోగాలు ఊడి రోడ్డున పడుతున్నారు. ఏదేమైనా సెక్యూరిటీ ఉండే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమేనని మరోసారి ఇలాంటి పరిణామాలు ప్రతి ఒక్కరిని అలర్ట్ గా ఉండేలా చేస్తున్నాయి. ఇంకెంత మంది ఉద్యోగాలు పోతాయో, ఈ పరిస్థితులు మారడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి.