
ఈ మందు పిచ్చి అనేది యువతలో పెరిగిపోతుంది. యువతలో పెరుగుతున్న ఈ పిచ్చితనానికి సాక్ష్యం, ఆంధ్ర తెలంగాణలో కలిపి 25 వేల కోట్ల రూపాయల మందును తాగేసారట. తన సొంత సంపాదనలో దాదాపుగా 30 నుండి 40శాతం పేదలు ఖర్చు పెడుతూ ఉంటే ధనవంతులు 20 నుండి 30శాతం త్రాగుడుకే ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ ధనవంతులు ఆరోగ్యకరమైన మందు పేరుతో విస్కీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారట.
ఇది ఈమధ్య విపరీతంగా పెరిగిందట. భారతదేశంలో విస్కీ వినియోగం 65% పెరిగిందని తాజా అధ్యయనాలు చెప్తున్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేసిన సర్వేల ప్రకారం చూసుకున్నప్పుడు విస్కీ సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. అంటే తాగడం తగ్గడం బదులు కొత్తగా ఈ కాస్ట్లీ తాగుడు వైపుకు పోతున్నటువంటి పరిస్థితి.
దీనిని నియంత్రించడం ప్రభుత్వాల చేతుల్లో ఉన్న పనిలా కనిపించట్లేదు. చైతన్య పరచాలంటే నువ్వు ఎవరు మమ్మల్ని చైతన్య పరచడానికి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. త్రాగడం మంచిదా చెడ్డదా అంటే తాగినోడిని చేతకానోడు అని తిడుతున్న రోజుల్లో, ఎదురవుతున్న ఈ పరిణామాలు ఆడ మగ ఇద్దరూ కలిసి, ఇదివరకు భర్త తాగితే తిట్టే భార్య ఇప్పుడు తిట్టడం మానేసి తాను కూడా త్రాగడం అలవాటు చేసుకుంటున్నారు. అది గొప్ప పని లాగా అదొక గొప్ప క్వాలిఫికేషన్ లా తయారవుతున్న పరిస్థితి వల్ల దేశానికి జరిగేది మంచో, చెడో భవిష్యత్తే తేల్చాలి.