వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కోటంరెడ్డి, ఆనం నారాయణ అసంతృప్తులు ఒక పక్కన ఇబ్బంది అయితే కేవలం 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. కైకలూరు మాజీ ఎమ్మెల్యే కైకలూరు జయమంగళ వెంకటరమణ అంతకుముందు జడ్పిటిసి సభ్యుడు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ఆయనకు టికెట్ తీసేసి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కామినేనికి ఇచ్చారు. ఆ తర్వాత బిజెపి తరఫున కామినేని గెలిచారు. మంత్రివర్గంలో చేరి ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు జయ మంగళ వెంకటరమణ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఆ తర్వాత వైఎస్సార్సీపి గెలిచింది.


ఇప్పుడు వైయస్సార్సీపీలో జయ మంగళ వెంకటరమణ చేరారు. కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని నేను కొన్ని డిమాండ్లు చేశాను, ఆ డిమాండ్లకు ఒప్పుకుంటే గనుక నేను వైయస్సార్సీపిలో చేస్తానని చెప్పడం, తెలుగుదేశం పార్టీలో నాకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పడం ఒక పక్కన జరిగాయి. కారుమూరి నాగేశ్వరరావు ఆయన గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఆయనకు ఇప్పించే విధంగా మాట్లాడినట్టు కూడా ప్రచారం జరుగుతుంది.


అది కాకుండా మరో  రెండో అసమ్మతి స్వరం బయటికి వచ్చింది. అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలో ఈర్ల శ్రీరామమూర్తి.. అయ్యన్నపాత్రుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కులం పైన బ్రతికే వ్యక్తి ఆయన, కులం కోసం బతికేవాడు కాదంటూ, ఆయన వెలమ కుల ద్రోహి అంటూ మండిపడ్డాడు. రాజకీయంగా తనను ఎదగనివ్వడం లేదనే అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.


2018లో రెవిన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటి నుండి తాను తెలుగుదేశం పార్టీ కి సేవలు అందిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని, కానీ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన తాను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP