తుపాకులతో కాల్చేయడం, కార్లతో యాక్సిడెంట్లు చేయడం, పెద్ద వారిని, చిన్న పిల్లల్ని కూడా చంపేడం లాంటి క్రూరమైన చర్యలు ప్రస్తుతం అమెరికాలో ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఇప్పుడు అగ్రరాజ్యంలో జాంబిస్ తయారయ్యారని తెలుస్తోంది. కొంతమంది జాంబిస్ లాగా మారిపోతున్నారని దీనికి కారణం మత్తు పదార్థాలు అతిగా వాడటం వల్లేనని అనుకుంటున్నారు. అయితే అత్యవసర సమయాల్లో వాడే మత్తు మందులు, మానసిక రోగులకు వాడే మందులను ఎవరికి వారు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపేరే జాంబి డ్రగ్.


దీనిపై యూఎస్ఏ డ్రగ్ డిపార్ట్ మెంట్ కూడా చర్చ జరుపుతోంది. ప్లెష్ ఈటింగ్ డ్రగ్, స్కిన్ రోటింగ్ డ్రగ్, జాలజిన్ యానిమల్ ట్రంకులైజర్ అంటారు. శరీరంలో పుండ్లు పడుతున్నపుడు తగ్గించే క్రమంలో వాడతారు. రెస్పిరెటరీ, బీపీ విషయంలో దీన్ని వాడేవారు. ఫిలడెల్పియాలో దీన్ని వాడిన వారిలో 100కు 90 మంది డోప్ టెస్టులో దొరికిపోయారు.


హెరాయిన్ బదులు దీన్ని వాడటం 2000 సంవత్సరం నుంచి అలవాటు చేసుకున్నారు. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పని చేస్తుంది. కొలంబియా, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో 26 శాతం మంది ఈ డ్రగ్ ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇంకా కొన్ని రకాల మత్తు పదార్థాలు వాడుతున్నట్లు పెంటనైల్ లాంటి మందులు కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ మత్తు పదార్థాలు వాడటం వల్లే కాల్పులు జరపడం, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చంపేయడం లాంటివి చేస్తున్నారు.


 81 వేల మంది ఈ జాంబి డ్రగ్ వల్లనే చనిపోయారని తెలిసినా ఇప్పటికీ అమెరికాలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ డ్రగ్ ను ఎలా కంట్రోల్ చేయాలి. ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై  అమెరికా ప్రస్తుతం ఆలోచిస్తుంది.  యువతను తప్పుదోవ పట్టేలా చేస్తున్న దాన్ని పట్టించుకోకుండా ఎంతో మంది చావులకు కారణమవుతున్నారు. దీన్ని అరికడితే చాలా ప్రాంతాల్లో గన కల్చర్ పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: