
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను ఏకం చేస్తూ రంగా అప్పట్లో రాజకీయ వ్యూహాన్ని రచించారు. అందుకు భిన్నంగా ఆ కులాల మధ్య ఉన్న అంతరాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా జగన్ మోహన్ రెడ్డి వ్యూహాన్ని రచించారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాకు సంబంధించిన శెట్టి బలిజలకు ప్రాధాన్యమిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక జరిగింది. ఆ తర్వాత బలిజ సామాజిక వర్గానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీలలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వారే ఉన్నారు.
వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ వాళ్లలో శెట్టిబలిజలను బీసీ కోటలో వేసి చూపించారు. అందుకే కాపులకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా ముద్ర పడిన జనసేన చుట్టూ రాజకీయ చక్రాన్ని జగన్మోహన్ రెడ్డి తిప్పుతున్నారు. అంతర్గతంగా ఆ కులాలకు ఉండే అంతరాన్ని ఇప్పుడు వైసీపీ ఎలివేట్ చేస్తుంది. జనసేన రూపంలో కేవలం కాపు ఓట్లు జారిపోయినప్పటికీ బలిజ, శెట్టి బలిజ, తెలగ, ఒంటరి కులాలు వేరు అని, అవి తమ వైపుగా ఉంటాయని వైసిపి భావిస్తుంది. కాపు సామాజిక వర్గం గొడుగు కింద ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని బలిజ, శెట్టి బలిజ, తెలగ, ఒంటరి కులాలను వేరు చేయడంలో జగన్ విజయం సాధించారని రాజకీయ వార్తలు నడుస్తున్నాయి.