వాట్సాప్ లో వచ్చే వీడియోలను, వాయిస్ లను  అతిగా నమ్మకూడదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలను, వీడియోలను వక్రీకరించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు, అదే సమయంలో ఆ రాజకీయ నాయకుడి చరిష్మాను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.


టీడీపీ యువనేత విషయంలో ఇదే జరిగింది. ఒక సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. దళితులు ఏమీ పీకలేరని అన్నారని పెద్ద ఎత్తున్న వైసీపీ పార్టీ తెగ వైరల్ చేసేసింది. అయితే లోకేశ్ అలాంటి మాటలు మాట్లాడలేరని తెలుస్తోంది. దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వాయిస్ ను మిక్సింగ్ చేసి లోకేశ్ వాయిస్ ను కొన్ని చోట్ల కట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ  వైసీపీ పార్టీ నాయకులు లోకేశ్ దళితులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని తెగ వైరల్ చేశారు.


దీన్ని లోకేశ్ కొట్టి పారేశారు. ఆయన ఏ సమావేశంలో మాట్లాడారు. అక్కడ మాట్లాడిన మాటలు ఏంటి.. చేసిన వ్యాఖ్యలు ఏంటి దాన్ని ఎలా మిక్స్ చేసి తప్పుగా చూపించారో చెబుతూ రెండు వీడియోలను ప్రజల ముందు బయటపెట్టారు. దీంతో ఇలాంటి దారుణానికి ఎవరూ ఒడిగట్టారో తెలుసుకోవాల్సిన అవసరముంది.


టీడీపీ లో ఉన్న దళిత నాయకులు కూడా లోకేశ్ పై తప్పుడు ప్రచారం చేయడానికి మార్పింగ్ చేసి వాయిస్ ను కట్ చేసి ఇలా చేశారని ఆరోపించారు. అయితే పోలీసులు అధికార పక్షంలో ఉన్న వారు  తప్పు చేస్తే విడిచి పెట్టడం చేయకూడదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు చేస్తే పట్టుకుని ఎలాగైతే శిక్షిస్తారో అధికారంలో ఉన్న వారిని ఇలాంటి వి చేస్తే  విడిచిపెట్టకూడదు. ఈ రోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వారు. రేపు మరేదైనా విషయంలో ఇలా చేయరని గ్యారంటీ ఏంటీ? కాబట్టి మార్పింగ్, వాయిస్ మిక్సింగ్ చేసి రాజకీయ నాయకులను దెబ్బతీయాలని చూస్తున్న సోషల్ మీడియా వారియర్స్ ను కనిపెట్టి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: