వైసీపీ నాయకులు పదే పదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కామెంట్లు చేస్తుంటారు. ఏకంగా జగనే ఒకసారి మూడు పెళ్లిళ్ల గురించి మీడియా ఎదుట మాట్లాడారు. దీనిపై అప్పట్లోనే జనసేన నాయకులు తీవ్రంగా విమర్శించారు. వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వారే ప్రధాన నిందితులనే ఆరోపణలతో సీబీఐ విచారణ చేస్తోంది.


ఇలాంటి సమయంలో జనసేన నాయకులు అసలు వైఎస్ కుటుంబ చరిత్రను ఒకసారి బయటపెట్టారు. వైఎస్ వంశ వృక్షం గురించి వివరంగా తెలిపారు. వైఎస్ వెంకట రెడ్డికి లక్ష్మమ్మ మొదటి భార్య కాగా, మంగమ్మ రెండో భార్య. లక్ష్మమ్మ మొదటి కొడుకు చిన్న కొండారెడ్డి, మంగమ్మ గారి కొడుకు వైఎస్ రాజిరెడ్డి,  అయితే చిన్న కొండారెడ్డి పిల్లల్లో వేదవతి, సుశీలమ్మ, వైఎస్ ఆనంద్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, ఈసీ సుగుణ ఉన్నారు.


ఇందులో ఈసీ సుగుణ కూతురే భారతి. ఇంకా సులోచన, శ్యామల, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈయన కుమారుడే వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ మనోహర్ రెడ్డి, జోసెఫ్ లు ఉన్నారు. మంగమ్మకు జన్మించిన పిల్లల్లో మొత్తం 9 మంది ఉన్నారు. అందులో వైఎస్ రాజిరెడ్డి పెద్ద వారు.ఇందులో వైఎస్ జార్జి రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, బి. విమలారెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి లు ఉన్నారని జనసేన నాయకులు చెబుతున్నారు.


ఇలాంటి సందర్భంలో పవన్ కల్యాణ్ కుటుంబం గురించి మాట్లాడే సమయంలో మీ కుటుంబం గురించి ముందు ఆలోచించాలని సూచిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు తెలియని పేర్లను కూడా జనసేన బయటపెట్టింది. వైసీపీ అభిమానులకు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. ఇలా జనసేన నాయకులు మాట్లాడుతూ..  వైసీపీ వంశ వృక్షం ఆ పార్టీ నాయకులు ముందు తెలుసుకుని పవన్ కల్యాణ్ ను తర్వాత విమర్శించాలని చురకలంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YSR