అధికారంలోకి రాకముందు సీఎం జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. అయితే అక్కడ కొంతమంది ఆయన పాదయాత్ర చేసి వెళ్లిన తర్వాత పసుపు నీళ్లతో కడిగేశారు. చాలా మంది నిరసన కూడా తెలిపారు. దీంతో ఆయనకు ఆ ప్రాంతంపై కాస్త కోపం ఉన్నట్లు చెబుతారు.


కావాలనే చేసిన పని అయినా అలాంటివి చేయడం వల్ల జగన్ కాస్త ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కాలం మారింది. ప్రతిపక్ష నాయకుడు జగన్ కాస్త సీఎం అయ్యారు. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించడం, తర్వాత సీఎం జగన్ అమరావతి రాజధాని కాదు మూడు రాజధానుల అంశంతెరపైకి తేవడం, తర్వాత వైజాగ్ ప్రధాన రాజధాని అని చెప్పడం. ఇలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.


అమరావతి లో రోజు నిరసనలు నిర్వహించడం ఇలా అనేక సంఘటనలు జరిగాయి. జగన్ పాదయాత్ర చేసిన అమరావతి లో తెలిపిన నిరసనలే దీనికి కారణమని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే జగన్ ప్రస్తుతం అమరావతి లో ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి అమరావతి నుంచి కాకుండా బెజవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి ప్రజలను సభకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పట్టాలు పంపిణీ చేసే సమయంలో నిరసనలకు దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది.


గతంలో ముఖ్యమంత్రిగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళుతున్న సమయంలో కూడా ఆయనకు వెకిలి గుర్తులతో అవహేళన చేసిన సంఘటనలు ఉన్నాయి. మరి ఈ సమయంలో అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి వెళుతున్నారు. సీఎం జగన్ కు ఎలాంటి అనుభవం ఎదురు కానుంది. ఎక్కువగా టీడీపీ అనుకూల నాయకులు ఉండే ఈ ప్రాంతంలో సీఎం పర్యటన అంటే ఎలాంటి నిరసనలు ఎదురవుతాయోనని ప్రభుత్వం పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: