పక్క దేశాల విషయంలో అమెరికా విధానం, ఆ దేశం అభివృద్ధి అయ్యే విధానం మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఒక దేశం దానికన్నా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని అనుమానం వస్తే అమెరికా వెంటనే దానికి తగ్గట్టుగా పావులు కదుపుతుందని అంటారు. ఇప్పుడు చైనా ఎదుగుతుందని అనుమానం వచ్చి దాన్ని ఒక సంక్షోభంలో గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది అమెరికా.


అదేంటంటే సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో అమెరికా, జపాన్, కొరియా ఇంకా చైనా  ముందుకు వెళుతున్నాయి. రా మెటీరియల్ వీళ్ల దగ్గరే ఎక్కువగా దొరుకుతుంది. అయితే మిగిలిన దేశాలన్నిటిని చైనాకు ఈ రా మెటీరియల్ ఇవ్వద్దని చెబుతూ అమెరికా ఆర్డర్లు వేసింది ఇప్పుడు. అలాగే అప్ గ్రెడేషన్ ఇవ్వద్దని కూడా చెప్తుందట. పాత చిప్స్ ఓకే కానీ కొత్త సెమి కండక్టర్ చిప్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ ని ఇవ్వద్దని అమెరికా చెప్తుందట.


ఇలా దానికి సంబంధించిన డ్రాయింగ్ తయారు చేసే దేశాలకు చెప్పిందట. దానివల్ల ఆ రా మెటీరియల్ పంపిణీ అనేది చైనాకు ఆగిపోయినట్లుగా తెలుస్తుంది.‌ అయితే అమెరికా కుట్రను గ్రహించిన చైనా అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. అదేంటంటే మైక్రాన్ టెక్నాలజీతో వాడే జైంట్ చిప్ కంపెనీపై చైనా నిషేధాన్ని విధించిందట. అమెరికా ఎలా అయితే ఈ టిక్ టాక్ యాప్ ని నిషేధించడానికి ఎలా కారణమైందో తెలిసిందే.


అందుకనే చైనా వాళ్లు కూడా ఇప్పుడు ఈ చిప్స్ తయారీ దేశ భద్రతకు ముప్పు అన్నట్లుగా చెప్పుకొస్తున్నారట. టెలికాం, ట్రాన్స్పోర్ట్, ఫైనాన్స్ రంగాలను దెబ్బతీసేటువంటి అతిపెద్ద ఎత్తుగడ ఇప్పుడు చైనా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చైనా విదేశాలకు ఎగుమతి చేసే చిప్ కంపెనీల మీద ఆంక్షలు విధించడం మొదలు పెట్టిందట.  సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రకటనను విడుదల చేసింది. జీ7 దేశాల్లో చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కుట్ర చేసిన కొద్దిసేపటికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: