బాలిక‌ల సంర‌క్ష‌ణ‌కు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. ఆడ‌పిల్ల‌ను భారంగా భావిస్తున్న కొంత‌మంది త‌ల్లిదండ్రులు పురింట్లోనే చంపేయ‌డం లేదా..లింగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌తో క‌డుపులోనే చంపేస్తు వ‌స్తున్నారు. గ‌తంలో  ఇలాంటి ఘోర‌మైన ప‌రిణామం ఎక్కువ‌గా ఉన్నా..కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కృషితో కొంత‌మేర స‌మ‌సి పోయింది. అయితే పూర్తిగా స‌మ‌సిపోలేదు. ప్ర‌ప‌చం వ్యాప్తంగా ఈ స‌మ‌స్య ఉన్నా..భార‌త్‌లో అత్య‌ధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అది కూడా హ‌ర్యానా లాంటి రాష్ట్రాల్లో పెచ్చురిల్లిపోతోంద‌నే చెప్పాలి.

 

స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌(ఎస్‌డబ్ల్యూఓపీ-స్వాప్‌) యూఎన్‌ఎఫ్‌పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్‌ బేస్డ్‌ సెక్స్‌ సెలక్షన్‌(జీబీఎస్‌ఎస్‌-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన క‌లిగించే అంశం. దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్న‌ట్లు ఈ నివేదిక పేర్కొంది. 


చట్టాలపై చట్టాలు చేస్తున్నా చర్యలు చేపడు తున్నామని పాలకులు ఎంతగా చెప్తున్నా దేశ వ్యాప్తంగా జరుగుతున్న బ్రూణహత్యలు నియంత్రించ డంలో పాలకులు విఫలమవ్ఞతున్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వపరంగా ఈ చట్టాలను అమలు చేయడంలో అధికారులు అవలంభిస్తున్న ఉదాసీన వైఖరి వల్లనే ఈ బ్రూణ హత్యల పరంపర కొనసాగుతూ అంతకంతకు పెరుగుతూనే ఉంది.తల్లిగర్భంలోనే మాతృత్వాన్ని చంపే స్తున్నవారికి కఠినశిక్షలు పడేవిధంగా చట్టాలు రూపొం దించినా అమలు విషయంలో నిర్లక్ష్యవైఖరితో ఇది కొన సాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్కానింగ్‌ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేయరాదని స్పష్టమైన నోటీసుబోర్డులు ఉన్నా అవి గోడలకే పరిమి తం అవ్ఞతున్నాయి.

 

లింగనిర్థారణ ప్రోత్సహించినవారికి, పరీక్షలు నిర్వహించిన వారికి చట్టపరమైన చర్యలు తీసు కొని పునరావృతం కాకుండా చేయాల్సిన అధికార గణం రకరకాల కారణాలతో వెనుకంజవేస్తున్నారు. కొంత అవి నీతి, మరికొంత రాజకీయజోక్యంతో కొన్ని ఆస్పత్రుల యజమాన్యాలవైపు కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. లింగనిర్ధారణలో ఆడశిశువ్ఞ అని తేలితే అబార్షన్‌కు వెను కాడటం లేదు. ఇలా గ్రామాల్లో,మండల కేంద్రాల్లో వచ్చీ రాని వైద్యంతో తల్లిప్రాణాలు కూడా కోల్పోయిన సంఘ టనలు కోకొల్లలు. గర్భం దాల్చిన మహిళ ప్రాణాలకు ముప్పువాటిల్లిన సమయంలోనూ, శిశుఅంగవైకల్యంతో ఉన్నట్లు నిర్ధారణ జరిగితే చట్టబద్ధంగా అబార్షన్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రి యాజ మాన్యాలే ఇష్టానుసారంగా ఈ చట్టాన్ని అడ్డంపెట్టుకొని అబార్షన్‌లు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: