ఈ క్రమంలో చర్చల ద్వారా..ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడంలేదు. పోనీ.. రాజకీ యంగా కేంద్రం ద్వారా ఒత్తిడి తెచ్చి పరిష్కరించుకుందామని అనుకున్నా.. అది కూడా ఇప్పట్లో సాధ్యమ య్యేలా కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే పులిచింతల నిండిపోయి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా వందల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. మరోవైపు శ్రీశైలం ఎండిపోతోంది. దీంతో ఖరీఫ్ సాగు కనాకష్టంగా మారిపో యింది. మరి ఈ సమయంలో జగన్ ఏం చేయాలి? కేవలం అటు కేంద్రానికి ఇటు కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాస్తూ.. కూర్చుంటే సరిపోతుందా? అంటేకాదనే అంటున్నారు పరిశీలకులు.
తక్షణం జలవిద్యుత్ ఉత్పత్తిని నిలుపదల చేసేలా.. తెలంగాణ సర్కారుకు తలతిరిగిపోయేలా సమాధానం చెప్పాలంటే.. న్యాయపోరాటం ఒక్కటే మార్గమని అంటున్నారు. అయితే.. జగన్ మాత్రం ఆ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వేయలేదు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకుజీవనాధారం, ప్రాణాధారమైన జలాల విషయంలో తీవ్ర ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అదే.. తన సొంత కేసులు.. లేదా.. రెండేళ్లపాటు సీఎంగా తాను తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వచ్చినా.. కోర్టులు తప్పుబట్టినా.. వెంటనే న్యాయ పోరాటం చేశారని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని.. ఆయా కేసులు వాదించేవారికి జీతంగా ఇచ్చారని అంటున్నారు. మరీముఖ్యంగా రాజధాని అమరావతి పై తన మాటే నెగ్గించుకోవాలనే పంతంలో రోజుకు రూ.5 కోట్లతో ఓ లాయర్‌ను నియమించుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరి.. తన సొంత కేసులు, తన సొంత నిర్ణయాలను సమర్ధించుకునేందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేసి బలమైన లాయర్లను నియమించుకుని న్యాయ పోరాటం చేసిన జగన్ ఇప్పుడు.. అతి పెద్ద జలవివాదం వచ్చినప్పుడు, రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు.. ఆ మాత్రం లాయర్లను నియమించుకుని న్యాయం చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి