వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయంటున్నారు టీడీపీ నేతలు.. ప్రత్యేకించి మాల, మాదిగలకు వైసీపీ నేతలు జీవించే హక్కు లేకుండా చేస్తున్నారని టీడీపీ దళిత నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన వల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రకాశం దుర్గి మండలం ఆత్మకూరులో దళితులు గ్రామం విడిచి ఇప్పటికీ తిరిగి రాలేని పరిస్థితి నెలకొందని వర్ల రామయ్య అంటున్నారు.


ప్రకాశం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఆయన టీడీపీ నేతలతో కలసి పర్యటించారు. ఆత్మకూరు, జంగమేశ్వర పాడు గ్రామాల్లోని కొన్ని వర్గాల వారు అన్నీ వదులు కొని తిరిగి రాలేని పరిస్థితి నిజం కాదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి పోలీసు రక్షణతో తీసుకువచ్చి వారికి రక్షణ కల్పించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ముటుకురు దళిత వర్గానికి చెందిన వారి వివాహానికి వస్తుంటే అడ్డంకులు సృష్టించారని వర్ల రామయ్య ఆరోపించారు.


నియంతలు అందరూ కాల గర్భంలో కలిసి పోయారని.. 151 సీట్లు ప్రజలు ఇస్తే అరాచక, అప్రజాస్వామిక పాలన చేస్తారా.. అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు. కేసులన్నీ టీడీపీ  వారిపైనే పెట్టారని, ఒక్క వైసీపీ కార్యకర్తపైన అయినా కేసులు పెట్టారా అని వర్ల రామయ్య పోలీసులను ప్రశ్నించారు. అసత్యాలు, అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి దళితులపైనే దాడులు చెస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.


దళిత డ్రైవర్ ను  వైసీపీ ఎమ్మెల్సీ చంపి ఆయన ఇంటి ముందు పడేయడం వాస్తవం కాదా అన్ని ప్రశ్నించిన వర్ల రామయ్య.. రాష్టంలో మాల, మాదిగలకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. మాస్క్ ఇవ్వమని ఆడిగిన డాక్టర్ సుధాకర్ చావుకు వైసీపీ నేతలో కారణమని.. దొంగ ఇసుక రవాణా చేయొద్దని అన్నందుకు ఓ దళితుడికి శిరోముండనం చేశారని.. దళిత మహిళని బంధించి ముష్కరులు అత్యాచారం చేసారని.. దళితులపై జరుగుతున్న దాడులను వర్ల రామయ్య వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: