కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆసుపత్రులలోనే స్థానికంగా అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రజలు వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూచించారు. గ్రామ స్థాయి నుండే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి వైద్య ఆరోగ్య రంగాలపై తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినితెలిపారు.


ఏ. కొండూరు మండలంలోని తండాలలో ప్రజలు క్రానిక్ కిడ్నీ డిసీజెస్ తో బాధపడుతున్నారని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. దీనిలో భాగంగా వ్యాధికి తగిన కారణాలను, మూలాలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు.  15 తండాలకు వాహనాల ద్వారా రక్షిత త్రాగు నీటిని సరఫరా చేస్తామని, రానున్న ఆరు నెలలలో 6 కోట్లతో పైపు లైన్ల ద్వారా రక్షత త్రాగునీటి సరఫరాకు చర్యలు  తీసుకుంటామని మంత్రి తెలిపారు.


కిడ్నీ వ్యాధి సమస్యను ఎదురుకునేందుకు ఎంత ఖర్చుకైన వెనుకాదని విధంగా ప్రభుత్వం అండగా వుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు రవాణాకు 12 సీట్లుగల మినీ వాహనం ఏర్పాటు చేయడం జరిగిందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. తండాలలో ప్రతీ నెల మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి సీనియర్ నెప్రాలజిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందన్న మంత్రి విడదల రజిని.. ఎయిమ్స్ సూచించిన మందులను ఉచితంగా అందిస్తామన్నారు.


తండాలలోని అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యంగా 25 సంవత్సరాలు వయసుకలిగిన వారు పరీక్షలకు సహకరించాలని మంత్రి విడదల రజిని సూచించారు. ఆరోగ్యశ్రీ పథకంలో 14 ప్రైవేటు కిడ్నీ వ్యాధి కిచిత్స అందించే ఆసుపత్రులలో అనుమతులు ఉన్నాయని మంత్రి విడదల రజిని తెలిపారు. ఏ కొండూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 'సేమి ఆటోమెటిక్ ఎనలైజర్ డయాలసిస్ వైద్యసేవలను మంత్రి విడదల రజిని పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: