ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం అంటే ఇప్పటివరకు అయితే చైనా. భూమిపై ఉన్న మొత్తం జనాభాలో నాలుగోవంతు జనాభా చైనాలోనే ఉన్నారు. జిడిపి విషయంలో 5వ స్థానం లో ఉన్న భారతదేశం జనాభా పెరుగుదల విషయంలో అయితే మరి కొన్ని నెలల్లో  నెంబర్ వన్ స్థానం లోకి రాబోతుంది. చైనా జనాభా141.5 కోట్లు గా ఉంటే ప్రస్తుతం 139 కోట్లు ఉన్న భారత జనాభా 2023 ఏప్రిల్ నాటికి చైనా జనాభాను అధిగమిస్తుందని లెక్కలు చెబుతున్నాయి. దీనికి కారణం ఇటీవల చైనాలో జననాల కన్నా మరణాల సంఖ్య ఎక్కువగా  నమోదవుతుంది.


గతేడాది కేవలం జననాలు 1.6 కోట్లు మాత్రమే నమోదు అయ్యాయి. దాదాపు భారత్ లో కూడా ఇదే విధంగా ఉన్నా చైనాతో పోలిస్తే ఇంకాస్త మెరుగ్గానే ఉంది. అదే భారత్ సంతానోత్పత్తి రేటు సగటు 1950లో 5.7% ఉంటే అది ఇప్పుడు 2%కి పడిపోయింది.1983లో చైనా జనాభా వృద్ధిరేటు సగటు 2% ఉంటే ప్రస్తుతం 1.1% ఉంది. అంటే జననాల రేటు అక్కడ సగానికి పడిపోయింది. అందువల్ల భారత్ ముందు స్థానంలోకి వచ్చింది. భారతదేశం మొత్తం జనాభాలో 47% జనాభా 25 ఏళ్ల లోపు వారే ఉన్నారు.


1947లో భారతదేశ ప్రజల సగటు వయసు 21 సంవత్సరాలుగా ఉంటే ఆ సమయంలో 60 ఏళ్లు పైబడిన వారు కేవలం 5% మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు భారతదేశ ప్రజలకు సగటు వయసు 28ఏళ్ళుగా ఉంటే 60 ఏళ్ళు పైబడిన వారు 10% గా ఉన్నారు. కొరియా, మలేషియా, థాయిలాండ్, తైవాన్ లాంటి తూర్పు ఆసియా దేశాలలో సంతానోత్పత్తి తగ్గడం కూడా భారతదేశం  జనాభా పెరుగుదలలో అగ్రస్థానంలోకి రావడానికి ఒక కారణం కాబోతుంది. ప్రపంచంలో 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయులే అవ్వడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ అడ్వాంటేజ్‌ను ఇండియా సరిగ్గా ఉపయోగించుకుంటా అన్నది కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: