నరేంద్ర మోడీ ట్రంపు హయాంలో అమెరికాకు వెళ్లారు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ సమావేశాలు జరిగాయి. ఎందుకంటే అమెరికాలో ఏదైనా సభ పెడితే దానికి కనీసం 10 వేల మంది కూడా రారు. అలాంటి లక్షల మంది జనాభా మోడీ సభలకు తరలివచ్చారు. దీనితో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. మోడీ అనగానే బలమైన నేతగా ప్రపంచం గుర్తింపు వచ్చింది.


భారత్ పై మోడీపై చాలా మందికి అసూయ కలిగింది అక్కడే. ఇంత ప్రజాదరణ చూసి చాలా దేశాల అధినేతలు తట్టుకోలేకపోయారు. బైడెన్ వచ్చాక మాత్రం కాస్త అన్యోన్యత తగ్గినట్లుగానే కనిపిస్తోంది. జూన్ నెలలో అమెరికాలో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. డిఫెన్స్ విభాగంలో లాజిస్టిక్స్ లో భారత్ లో తయారు చేసే విధంగా చర్చలు తెర వెనక జరుగుతునే ఉన్నాయి.


అత్యంత కీలకమైన ఇంజిన్ టెక్నాలజీ, హర్డ్ వేర్ టెక్నాలజీ ఒప్పందాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. చైనా నుంచి ఇండస్ట్రీస్ తరలిపోతున్న సమయంలో భారత్ దాన్ని రెండు చేతుల ఒడిసి పట్టకోవాలని చూస్తోంది. ఇప్పుడు దేశంలో నూతన పరిశ్రమలు రావడం అత్యవసరం. అవే కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడితే నాలుగింతల ఖర్చు అవుతుంది. కానీ అదే భారత్ లో పెడితే రెండింతలు మాత్రమే అవుతాయి.


కానీ అమెరికా మాత్రం రష్యా నుంచి ఎలాంటి సాయం తీసుకోకపోతే మేం పూర్తిగా సహకరిస్తాం అనే వాదనను మళ్లీ వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోడీ అమెరికా లో చేయబోయే పర్యటనపై అందరికీ ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆ ఆశల్ని మోడీ సఫలం చేస్తార అనేది చూడాలి. బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మొదటి సారి మోడీ అమెరికాకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోంది. భారత్ మాత్రం ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ముందుకు సాగుతుంది. మోడీ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: