అతి ముఖ్యమైన జీ20 సమావేశాలను భారత్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూనే ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. జీ20 సమావేశాల్లో ఇప్పటికే విదేశాంగ మంత్రులు, ఆర్థిక మంత్రుల వివిధ సమావేశాలు జరిగాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా రష్యా పై నిషేధం విధించాలని, సంయుక్తంగా ప్రకటించాలని చూసినా భారత్ మాత్రం న్యూట్రల్ గానే ఉంటుంది.


జీ20 లోని చాలా దేశాలు ప్రయత్నించినా ఇండియా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జీ 20 సదస్సులో అసలైన అంకం మొదలు కానుంది. దీనికి ఆయా దేశాల ప్రధానమంత్రులు హాజరుకావాలి. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు రావడానికి ప్రధాని మోదీకి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ వేరే దేశాల పర్యటనలు చేయలేదు.


ఇప్పటివరకు యూరప్ దేశాలు, అమెరికా అన్ని కలిపి రష్యాను దెబ్బతీయాలని చూస్తున్నాయి. గత రెండు పర్యాయాలు జరిగిన జీ20 సదస్సులకు పుతిన్ హాజరు కాలేదు. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న సమావేశానికి వచ్చే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారత్ ప్రస్తుతం న్యూట్రల్ గా ఉంటూనే రష్యా నుంచి అధిక మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అమెరికా రష్యాతో సంబంధాలు తగ్గించుకోవాలని సూచించినా భారత్ మాత్రం తన ఆర్థిక సామర్థ్యాన్ని ఎక్కడ తగ్గకుండా చూసుకుంటుంది.


పుతిన్ గనక జీ 20 సదస్సుకు హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. జీ 20 దేశాల్లో చాలా వరకు రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవి ఉన్నాయి. ఇలాంటి సమయంలో పుతిన్ సమావేశాలకు హాజరైతే ఆయా దేశాల ప్రతినిధులు సమావేశాల్లో ఉంటారా? పుతిన్ స్పీచ్ ను వినే అవకాశం ఉందా. ఏమైనా నిరసనలు తెలిపే సూచనలు ఉన్నాయా.. అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి పుతిన్ రాక భారత్ కు మేలు చేకూరుస్తుందా.. లేక అమెరికాతో మరింత ఇబ్బందులకు గురి చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: