
టీడీపీ ప్రస్తుతం గెలిచిన స్థానాల్లో మా విజయం, మా శ్రమ అని చెప్పుకుంటున్నారు. తప్ప జనసేన అండగా ఉందని ఎక్కడ చెప్పడం లేదు. దీంతోనే అర్థం చేసుకోవచ్చు. రేపు టీడీపీ గెలిచిన తర్వాత జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుందనేది. కాబట్టి జనసేన అధినేత పవన్ ఇప్పటికైనా పార్టీని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది. గతంలో రెండు స్థానాల్లో పవన్ ఓడిపోయారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ దూకుడుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పొత్తు పెట్టుకున్న కూడా తనకంటూ తన పార్టీకి ప్రత్యేక స్థానం ఉండేలా చూసుకోవాలి. ఎవరో చెబితే వినే విధంగా ఉంటే మాత్రం వచ్చే ఎన్నికల నాటికి కూడా జనసేన పరిస్థితి మారదు. తాను మెరుగవుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత ప్రచారం వచ్చేలా చేయాలి. జగన్ ని గద్దె దించాలనుకోవడం తప్పు కాదు. కానీ తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం తప్పు. జనసేనకు విపరీతమైన కార్యకర్తల బలం ఉంది. దాన్ని సరిగా వినియోగించుకుని ప్రజల్లోకి జనసేన వెళ్లాలి. గెలిస్తే ఏం కార్యక్రమాలు చేస్తారనేది ప్రజలకు చెప్పాలి. వారిని మెప్పించి ఓట్లు సాధించి అధికారంలోకి రావాలి.