వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆంధ్రాలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అని ఇప్పటికీ చాలా సార్లు ప్రకటించారు. అందులో కర్ణాటక ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికలు రావచ్చని అన్నారు. కానీ ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు జరిగిపోతున్నా కూడా ఆంధ్రాలో ఎలాంటి ఎన్నికలు జరగడం లేదు. అయితే రఘురామకృష్ణం రాజు వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత వైసీపీ ప్రభుత్వం పై జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.


దీన్ని ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వం అదునుగా చేసుకొని చంద్రబాబు కూడా  కొద్ది రోజుల్లోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అని టీడీపీ  శ్రేణులకు చెబుతూ వచ్చారు. ఎందుకంటే ఎన్నికలు ఉంటే టీడీపీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉంటారు. లేకపోతే ఇనాక్టివ్ అయిపోతారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం, మండలం జిల్లా వ్యాప్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. చురుగ్గా కార్యకర్తలు ఉన్నప్పుడే ఆ పని సజావుగా సాగుతుంది.


వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది. ఈ విధ మైన ఆలోచనలతో చంద్రబాబు నాయుడు శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. కానీ రఘురామకృష్ణం రాజు ఇప్పటికీ ఒక 40 50 సార్లు ఎన్నికల గురించి మీడియా ఎదుట ప్రస్తావించారు. కానీ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కనిపెట్టలేకపోతున్నారు.


ప్రస్తుతం రఘురామ చెబుతున్న మాట తెలంగాణలో కేసీఆర్ తో పాటు జగన్ ఎన్నికలకు వెళ్తారు. ఎందుకంటే ఒకేసారి అక్కడ ఇక్కడ ఎలక్షన్స్ జరగడం వలన ఆంధ్ర ఓటర్లు ఆంధ్రాలోనే తెలంగాణ ఓటర్లు తెలంగాణలోనే ఓటు వేయడం ద్వారా ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఓట్లు ఎవరికి పడవు. దాదాపు  ఎక్కువగా టీడీపీకి పడే అవకాశం ఉంటుందని భావిస్తే జగన్ కేసీఆర్ తో పాటు ముందస్తుకు వెళతారు. లేకపోతే సాధారణ ఎన్నికలకే వెళ్లాలని జగన్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: