భూ వనరుల విభాగం అందించిన తాజా సమాచారం ప్రకారం విశిష్ట భూ కొలతల గుర్తింపు సంఖ్య నేషనల్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ యుఎల్పిఐఎన్ భూ ఆధార్ ని 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదించాయి. మరో ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ప్రయోగ ప్రాతిపదికన పేరు మీద ఈ విధానాన్ని పరిశీలించాయి. 18 ఏప్రిల్ 2023 నాటికి ఆరు లక్షల 22 వేల గ్రామాల్లో హక్కుల రికార్డుల కంప్యూటీకరణ పూర్తయింది.
భూ ఆధార్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మరో విప్లవాత్మకమైన సంస్కరణ అని కొంతమంది మేధావులు భావిస్తున్నారు. విదేశాల్లో ఇక్కడికి లాగా సర్వేయర్లు వచ్చి భూమిని కొలిచే పద్ధతి ఉండదు. అంతా అక్కడ ఆన్లైన్లోనే జరిగిపోతుంది. ఒక ఇంటిని సగంగా విభజించాలని లెక్క వచ్చినప్పుడు మాత్రమే నిబంధనలను కట్ చేయాల్సి వస్తుందని, మిగిలినదంతా సులభంగానే సాగిపోతుందని వాళ్లు అంటున్నారు.
అది కూడా ఫ్లాట్ ని ఫ్లాట్ లాగా, స్థలాన్ని స్థలం లాగా అమ్మేస్తారట. అదే నిబంధన ఇప్పుడు ఇక్కడ రాబోతుందని 18 ఏప్రిల్ 2023 నాటికి ఆరు లక్షల ఇరవై రెండు వేల గ్రామాల్లో హక్కుల రికార్డుల కంప్యూటీకరణ పూర్తయిన నేపథ్యం ఇది. అయితే ఒక పక్కన పై నుండి కేంద్ర ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే కిందకి ఇక్కడికి వచ్చేసరికి, తమ స్టిక్కర్లు అంటించేస్తున్నారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి