చైనా దుందుడుకు చర్యలకు భారత్ కళ్లెం వేసే దిశగా పయనిస్తోంది. సై అంటే సై అంటూ ముందుకు దూసుకెళుతుంది. చైనా తన ఆధిపత్య పోకడలతో సరిహద్దున ఉన్న అన్నిదేశాలతో గొడవలు పెట్టుకుంటోంది. దీని వల్ల తమ ప్రాభవాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ భారత్ మాత్రం సరిహద్దు ప్రాంతాల్లో తమ భద్రతకు ఎలాంటి ముప్పు వచ్చిన దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా తయారైంది.


డ్రాగన్ కంట్రీ తైవాన్, ఇండియా,పిలిప్పీన్, ఆస్ట్రేలియా సముద్ర జలాలు, ఇలా ప్రతి దేశంతో సరిహద్దుల వద్ద గిల్లికజ్జాలు ఆడుతోంది. ఇతర దేశాల సరిహద్దులను తమవిగా చూపించుకుంటూ రెచ్చగొడుతుంది. దీని వల్ల ప్రపంచంలో అమెరికా కాదు చైనానే పెద్దన్నగా నిరూపించుకోవాలని కోరుకుంటోంది. దీని వల్ల దాని చుట్టు పక్కలా  దేశాలతో పాటు అమెరికా సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చైనా దూకుడుకు కల్లెం వేసేలా భారత్ ప్రణాళికలు రచించింది.


గతంలో రఫెల్ యుద్ధ విమానాలు, అగ్నిస్ క్షిఫణులు ప్రయోగించడం ఇండియా ఈజీగా చేయగలదు. కానీ ప్రస్తుతం రెండు బ్రహ్మోస్ రెజిమెంట్ ఈఆర్ 800 ఏర్పాటుకు ఓకే చెప్పింది. ఒక్కో రెజిమెంట్ లో 100 మిస్సైల్స్, 5 రాకెట్ మొబైల్ లాంచింగ్ వెపన్స్ ఉంటాయి. దీని ఏర్పాటు వల్ల చైనా ఏ క్షణంలో యుద్దంలోకి వచ్చిన పోరాడేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. భారత్ చైనాకు సమాధానం చెబుతూనే అగ్రరాజ్యాన్ని, యూరప్ దేశాలకు సున్నితమైన అంశాలను వివరించింది.


రాబోయే కాలంలో అమెరికాతో పాటు యూరప్ దేశాలు చైనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. చైనా దుందుడుకు చర్యలకు సంబంధించి భారత్ మాత్రమే దీటుగా సమాధానం ఇవ్వగలదు. కాబట్టి చైనాను ఎదుర్కొనే విషయంలో జాగ్రత్తగా ఉంటూనే భారత్ కు సాయం చేయాలి. అలా చేసినపుడే చైనాను నిలువరించగలం. ఇప్పటి నుంచే అమెరికా, దాని మిత్ర పక్షాలు చైనాపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే డ్రాగన్ కంట్రీ దుస్సహాసాలు మరింత మితిమీరిపోతాయని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: