తెలుగు దేశం పార్టీ లో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీలోని ముఖ్య నాయకులతో పార్టీని లాగేసుకున్నారని ఇప్పటికీ చాలా మంది ఆరోపిస్తుంటారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి పార్టీని నాశనం చేస్తుందని చంద్రబాబు నాయుడి ఆరోపణ. చంద్రబాబుతో పాటు అందరినీ పక్కన పెడుతున్నారని కారణంగానే తిరుగుబాటు వచ్చింది. 1998 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. 1998 లో లక్ష్మీ పార్వతి తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి దాదాపు 18 శాతం ఓట్లు, లక్ష్మీ పార్వతి టీడీపీ 3 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో టీడీపీకి వ్యతిరేకంగా 18 శాతం ఓట్లు వచ్చినట్లయింది.


కాబటట్టి చంద్రబాబు నాయుడు మాస్టర్ ఫ్లాన్ వేశారు. 1999 లో జరిగిన ఎన్నికల్లో లక్ష్మీ పార్వతి తెలుగు దేశంతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీకి 180 సీట్లు రావడం, కాంగ్రెస్ 90 సీట్లు, బీజేపీ 12, ఎంఐఎం 4, వచ్చాయి.  ఇదే సమయంలో అన్న తెలుగు దేశం పార్టీ పెట్టిన హరి కృష్ణకు ఒక్క సీటు రాలేదు. లక్ష్మీ పార్వతి తెలుగు దేశం పార్టీకి కూడా ఒక్క సీటు రాకపోవడంతో పాటు కేవలం 0.4 శాతం ఓట్లు రావడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది.


99 లో లక్ష్మీ పార్వతి తెలుగు దేశం పార్టీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. తర్వాత వెంకయ్య నాయుడికి, ఆద్వానీకి చంద్రబాబు దగ్గరవ్వడం బీజేపీతో 1999 లో పొత్తు పెట్టుకోవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో బాబు పాత్ర ఉండటంలో టీడీపీ అంటే చంద్రబాబు అనే పేరు మారుమోగింది. ఇలా చేయడం వల్ల టీడీపీ అధికారంలో రావడమే కాకుండా బలమైన శక్తిగా ఆంధ్రలో మళ్లీ పునర్వైభవం సాధించగలిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: