సీఎం జగన్ రాజకీయ చతురతతో ప్రతిపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో వలసల జోరు పెరిగింది. ఇతర పార్టీల నుంచి ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జిలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, ప్రజాప్రతినిథులు వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. దీనికి ఆ పార్టీ అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.


ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా.. ఆపార్టీలోకి వలసలు కొనసాగుతుండటం విశేషం. ఇక తాజాగా సీఎం జగన్ సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్లతో పాటు జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వైసీపీలో చేరిపోయారు.  


ఈ జాబితాలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తిన రాము, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కోసూరి సుబ్రహ్మణ్యం, రాజంపేట టీడీపీ లోక్ సభ ఇన్ఛార్జి గంటా హరి, ఏలూరు పార్లమెంట్ ఇన్ ఛార్జి గోరుమచ్చ గోపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి తో పాటు పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు.  ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ లతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.


ఒక్క విజయవాడే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు విశాఖ పట్నం, ఏలూరు, పాయకరావు పేట, నూజివీడు, రాజంపేట, వెంకటగిరి, సూళ్లూరిపేటకు చెందిన కీలక నేతలు కూడా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.  ఒకే రోజు ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు జగన్ చేరికలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో.  మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయం చేరికలతో కళకళలాడుతోంది. వీరికి వైసీపీ స్థానిక నేతలు కూడా సహకారం అందిస్తున్నారు. వీరంతా తమకు అదనపు బలం అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: