ఏపీ ఎన్నికల వేళ మ్యానిఫెస్టో అంశం కీలకంగా మారనుంది. జన రంజక ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ఓటర్ల మనసు దోచేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో మినీ మ్యానిఫెస్టోని ప్రకటించి ప్రచారం చేసుకుంటుండగా.. వైసీపీ ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల్లో మ్యానిఫెస్టో కచ్చితంగా ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు.


అయితే ఇక పూర్తిస్థాయి ఎన్నికల ప్రణాళిక పై ఎన్డీయే కూటమి నేతలు దృష్టి సారించారు. జగన్ ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు.  ఈ సమయంలో టీడీపీ కూటమి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళా ఓటు బ్యాంకే లక్ష్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీకి బీజేపీ, జనసేన తోడవడంతో మూడు పార్టీల హామీలను కలగలపి ప్రజా మ్యానిఫెస్టోని ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి. మూడు పార్టీల నుంచి నియమితులైన నేతలు సమన్వయ కమిటీగా మ్యానిఫెస్టో హామీలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.


తాజాగా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఈ కమిటీ నిర్ణయించింది. ఇందు కోసం టోల్ ఫ్రీ నంబరు ను ప్రకటించారు. 83411 30393 నంబర్ కు సాధారణ ప్రజలు సలహాలు సూచనలు వాయిస్ మెసేజ్, సందేశం, పీడీఎఫ్ రూపంలో పంపవచ్చని వీరు వెల్లడించారు.


ప్రస్తుతం టోల్ ఫ్రీ నంబర్ గురించే చర్చంతా నడుస్తోంది. ప్రజలు కోరిన కోర్కెలు తీర్చడం ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు. వారికి ఒక ఆశ కనిపిస్తే చాలు. తమ కష్టాలు పోవాలని అనేక హామీలు కోరుతుంటారు. వీటన్నింటిని టీడీపీ తమ మ్యానిఫెస్టోలో పెట్టగలదా అంటే లేదు.  ముందు రాష్ట్ర బడ్జెట్ ఎంత. ఆదాయ వనరుల సంగతి ఏంటి. దీంతో మనం ఏం చేయొచ్చు అని కూర్చొని చర్చించుకుంటే బావుంటుంది కానీ.. ఇలా టోల్ ఫ్రీ నంబర్ పెట్టి అభిప్రాయాలు సేకరించి.. చివరకి ఆయా పార్టీల అధినేతలకు నచ్చిన హామీలు ప్రకటిస్తే ఉపయోగం ఏంటన్నది విశ్లేషకులు వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: