అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో అన్ని పార్టీలకు కీలకంగా మారాయి. అందరికంటే.. ఈ ఎన్నికలు అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కల్యాణ్‌ ఇద్దరికీ చావో రేవో అన్నట్టు తయారయ్యాయి. అందుకే ఎన్ని విబేధాలు ఉన్నా వారిద్దరూ కలసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. గతంలో కలవడం, విడిపోవడం చంద్రబాబు, పవన్‌ ఇద్దరికీ అలవాటే అయినా ఇప్పుడు మాత్రం భవిష్యత్ కోసం ఇద్దరూ కలవక తప్పని పరిస్థితి.


ప్రస్తుతం ఏపీలో వైసీపీ, కూటమి మధ్య పోరాటం హోరాహోరీగా ఉంది. ఎవరు గెలిచినా వేవ్‌ మాత్రం కనిపించట్లేదు. గతంలోలా 175కు ఏ పార్టీకీ 140-150 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఓడితే మాత్రం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరి రాజకీయ దుకాణాలు బంద్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదట తెలుగు దేశం విషయానికి వస్తే.. ఇప్పటికే చంద్రబాబుకు వయస్సు మీద పడింది. దాదాపు 75 ఏళ్ల చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇక పార్టీని లోకేశ్‌ చేతుల్లో పెట్టి విశ్రాంతి తీసుకోవడం తప్ప చేసేదమీ ఉండకపోవచ్చు.


మళ్లీ మరోసారి ఎన్నికల్లో పోరాడాలంటే 2029 నాటికి చంద్రబాబుకు 80 ఏళ్లు వస్తాయి. అందువల్ల ఆయన ఇంకా పార్టీని జోష్‌గా నడిపించే అవకాశం లేదు. ఇప్పటికే లోకేశ్‌ సామర్థ్యంపై అంతగా నమ్మకం కలగట్లేదు. ఈ ఎన్నికల్లోనూ ఓడిపోతే.. టీడీపీ ఫ్యూచర్‌ కూడా కష్టమే. వైసీపీ గెలిస్తే టీడీపీ దుకాణం బంద్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


ఇక పవన్‌ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన పార్టీ పెట్టి ఇప్పటికే పదేళ్లు దాటిపోయినా ఒక అసెంబ్లీ గెలవడం తప్ప ఇప్పటి వరకూ సాధించిందేమీ లేదు. ఈ ఎన్నికల్లోనూ జనసేన ఓడిపోతే.. ఇక పవన్‌ కల్యాణ్‌ను ఆయన అభిమానులు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఎంత స్టార్‌ అయినాఈ ఎన్నికల్లో ఓడితే ఆయన జనసేన  పార్టీ దుకాణం కూడా బంద్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో ఏపీ జనం ఎలాంటి తీర్పు ఇస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: