దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ సక్రమంగా ఉపయోగించుకుంటుంది. దేశమంతా జై శ్రీరాం అనే నినాదాలతో బీజేపీ తన రాజకీయ అవకాశాలను సైతం మెరుగుపరుచుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేల ఉత్తరాధిఇలో కమల వికాసానికి అవకాశాలు మెరుగు అయ్యాయి. బీజేపీకి ఈ సారి సీట్లు బాగానే వస్తాయని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి.


బీజేపీ ఇచ్చే స్లోగన్స్ కి జనాలు ఎప్పుడూ ఓకే చెబుతూ వచ్చారు. వాటి ఆకర్షణలో పడి బీజేపీని పలు సార్లు అధికారంలోకి తెచ్చారు కూడా.  ఇదే విశ్వాసంతో ఈ సారి ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ టార్గెట్ 370 నినాదాన్ని ఇచ్చింది.  అయితే ఈ సంఖ్య వెనుక ఉద్దేశం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.


ప్రధాని మోదీ ఏ పని చేసినా.. ఏ నినాదం ఇచ్చినా దాని వెనుక రాజకీయ వ్యూహం పక్కాగా ఉంటుంది అనేది విశ్లేషకుల వాదన.  370 అనగానే మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 గుర్తుకు వస్తుంది. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఈ ఆర్టికల్ ను ప్రధాని మోదీ రద్దు చేశారు. దేశంలో ఏ ప్రధాని చేయలేని సాహసం మోదీ చేసి చూపించారు. అందుకే ఆయన్ను బలమైన నేతగా అభివర్ణిస్తుంటారు.


కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ ని తీసేయడం ద్వారా పాకిస్థాన్ కు చెక్ పెట్టినట్లు అయిందని అంతా భావించారు. తద్వారా మోదీ ఇమేజ్ అమాంతం పెరిగింది. దీని ప్రభావం మనం చూశాం. ఇప్పుడు 370 నినాదంలో మోదిత్వ, హిందుత్వ, జాతీయతకు సంబంధించిన నినాదం దాగి ఉంది. దీంతో పాటు ఎలాగూ గెలవబోతున్నాం.. ఇంకా బలంగా గెలవాలి అనే భావన్ను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లి వారిలో ఉత్తేజాన్ని నింపడం. మరోకటి ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలు ఈ 370 నినాదంలో దాగి ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: