ఇండియా కూటమి నాయకత్వం కోసం మిత్ర పార్టీల మధ్య హాట్ హాట్ గానే డిస్కషన్ సాగుతోంది.  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాను కూటమి సారథ్య బాధ్యతలు చేపడతాను అని పదే పదే చెబుతున్నారు. ఆమెకు ఒక్కొక్కరుగా మద్దతు ఇస్తున్నారు.  శరద్ పవార్ మమత నాయకత్వానికి ఓకే అనేశారు.  అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి దీదీ పగ్గాలు చేపట్టాలని గట్టిగా కోరుకుంటూ వస్తున్నారు.


ఇప్పుడు ఆర్జేడీకి చెందిన అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మమతకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించడం భేష్ అని అంటున్నారు.  ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా మమత వైపే ఉన్నారు అని అంటున్నారు.  ఇలా కీలక పార్టీలు అన్నీ మమతకే పెద్దరికం ఇవ్వాలని చూస్తున్న వేళ అనూహ్యంగా ఏపీలో వైసీపీ ఈ విషయం మీద స్పందించింది.  


ఇండియా కూటమిని సరైన దారిలో నడిపించడానికి మమతా బెనర్జీ సరైన నాయకురాలు అని విజయసాయిరెడ్డి కితాబు ఇవ్వడం చూస్తూంటే వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఏంటి జాతీయ స్థాయిలో ఆ పార్టీ విధానం ఏంటి అన్నది మరో మారు చర్చకు వస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో అడుగులు వేద్దామని అనుకుంటే అక్కడ కాంగ్రెస్ అడ్డు వస్తోంది.


అదే చేతులు మారి మమతా బెనర్జీకి పగ్గాలు దక్కితే వైసీపీకి ఓకేనా అన్నట్లుగానే చర్చ సాగుతోంది. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ ని ధిక్కరించి సొంతంగా పార్టీని పెట్టుకుని ముమ్మారు బెంగాల్ కి సీఎం అయ్యారు. ఆమెతో కలసి పనిచేయడానికి వైసీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చు అని అంటున్నారు.


ఇక ఇండియా కూటమిలోకి మమతా బెనర్జీయే వైసీపీని ఆహ్వానిస్తుంది అని అంటున్నారు. అందుకే ముందుగానే బయట ఉన్న వైసీపీ మమతకే బాధ్యతలు ఇవ్వాలని ఫుల్ సపోర్టు ఇచ్చిందని అంటున్నారు. మరి ఈ మమతానుబంధం అంతా ఇండియా కూటమి వైపు వైసీపీ చూపు సారించేందుకేనా అన్న చర్చ సాగుతోంది. అయితే తాము తటస్థంగానే ఉంటామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: