
పీ-4 లోగోను తొలి జనరల్ బాడీ సమావేశంలో చంద్రబాబు ఖరారు చేశారు.ఈ కార్యక్రమం సమర్థ అమలుకు సీఎం నేతృత్వంలో రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఛాప్టర్లు స్థాపించి, ఇన్‌ఛార్జి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సభ్యులుగా పనిచేస్తారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పీ-4 పథకం ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలకు గృహ నిర్మాణం, గ్యాస్ కనెక్షన్లు, నీటి సౌకర్యం, ఇంటర్నెట్, ఉపాధి అవకాశాలు వంటి సౌకర్యాలు అందించడం లక్ష్యం. ఈ పథకం సామాజిక సమతుల్యతను సాధించడానికి దోహరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.పీ-4 పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎలాంటి కోతలు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే, పీ-4 ద్వారా అదనపు మద్దతును అందిస్తుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక, సామాజిక ఉన్నతి కల్పించడం ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంలో భాగంగా, పీ-4 కార్యక్రమం రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి ఒక నమూనాగా నిలుస్తుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు