
2000 రూపాయలు ఇస్తే ఏ పనైనా చేసేదని మార్కెట్లో ఆ మాట ఉందని నేడు ఆమె రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆమె వ్యాంప్ కెక్కువ హీరోయిన్ కు తక్కువని ఈ పిచ్చి దాంతో వాళ్ళ పార్టీ నేతకు పిచ్చెక్కిందా ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదని కామెంట్లు చేస్తున్నారని రోజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చెప్పడానికి, రాయడానికి వీలు లేని భాషలో తన గురించి కామెంట్లు చేస్తున్నారంటూ రోజా ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే రోజా పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఈ ఫిర్యాదు గురించి సరిగ్గా స్పందించలేదని ఆమె భావించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలపై నేను గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను నన్ను దుర్భాషలాడటంతో పాటు అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదని ఆమె వెల్లడించారు.
అధికారంలో ఉన్నవాళ్లను ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి ఇది అని ఆమె అన్నారు. ఈ సంస్కృతి ప్రమాదకరమైన సంస్కృతి అని ఇలాంటి రాష్ట్రంలో మనం నివశిస్తున్నామని ఆమె వెల్లడించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గాలి భానుప్రకాష్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.
వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఈ ఘటన గురించి స్పందిస్తూ సినిమా వాళ్ళు అంటే మీకు ఎందుకు అంత చులకన అని అన్నారు. మీరు నెత్తిన ఎక్కించుకున్న పవన్ సినిమా మనిషి కాదా అని ఆమె అన్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. జగన్ సైతం భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సైతం ఇదే విధంగా వ్యవహరిస్తారని అప్పుడు తానేం చేయలేనని కామెంట్లు చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు